హెరాల్డ్ బర్త్ డే : 04-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 4 వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.

 మండలి వెంకట కృష్ణారావు జననం : గాంధేయవాది మాజీ రాష్ట్ర మంత్రి అయినా మండలి వెంకటకృష్ణారావు 1926 ఆగస్టు 4వ తేదీన జన్మించారు. అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండలి వెంకట కృష్ణారావు. ఈయన  ప్రజలకు చేసిన సేవలకుగాను దివిసీమ గాంధీగా ప్రజల మన్ననలు అందుకున్నారు. ముఖ్యంగా నిరుపేదలు అభివృద్ధికి ఎంతో కృషి చేసారు.  విద్యా సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రధమ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు మండలి వెంకట కృష్ణారావు.

 జంధ్యాల పాపయ్య శాస్త్రి జననం : అత్యంత జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు అయినా జంధ్యాల పాపయ్య శాస్త్రి 1912 ఆగస్టు 4వ తేదీన జన్మించారు. ఈయన కవిత్వం సులభమైన శైలిలో సమకాలీన ధోరణిలో చక్కని తెలుగు నుడికారంతో వినసొంపుగా ఉండేది
 ఖండకావ్యములు రచించడం జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రత్యేకత అని చెప్పవచ్చు. ముఖ్యంగా కరుణ  రస ప్రధానముగా కవితలు వ్రాసి కరుణశ్రీ గా ఎంతగానో ప్రసిద్ధులయ్యారు జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణ రసం తో కూడిన ఎన్నో కవితలు రాయడంతో  ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

 ఉండవల్లి అరుణ్ కుమార్ జననం  : ప్రముఖ రాజకీయ నాయకుడు భారత పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ 1954 ఆగస్టు 4వ తేదీన జన్మించారు. రాజమండ్రి లోక్ సభ  నియోజకవర్గం నుంచి 14వ 15వ లోక్ సభకు జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాజకీయాల్లో ఈయన  ఒక తెలివైన రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖ్యంగా ఈనాడు దినపత్రికకు వ్యతిరేకంగా ఎంతో మంది కాంగ్రెస్ యువ నాయకులతో కలిసి ఈ వారం అనే  రాజకీయ వారపత్రికను కూడా ప్రారంభించారు ఉండవల్లి అరుణ్ కుమార్

 మాళవికా మోహనన్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయినా మాళవిక  మోహనన్ 1992 ఆగస్టు 4వ తేదీన జన్మించారు. మలయాళం తమిళ సినిమాల్లో  ఎక్కువగా గుర్తింపు సంపాదించారు మాలవిక . ఇక పలు సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా మాళవిక  మోహనన్  కుర్రకారును ఎక్కువగా ఆకర్షించె వారు. హీరోయిన్ పాత్రలు పోషించడం తో పాటు.. ముఖ్య పాత్రలో కూడా నటించి ఎంతో గుర్తింపు సంపాదించాలి మాళవిక  మోహనన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: