హెరాల్డ్ బర్త్ డే : 28-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 28వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 


 కాసు బ్రహ్మానంద రెడ్డి జననం : ఆంధ్ర  ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 వ తేదీన జన్మించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా పలు మంత్రి పదవులను అలంకరించారు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా కొనసాగారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు కాసు బ్రహ్మానంద రెడ్డి. ఈయన  12వ ఏటనే విజయవాడ కు వచ్చిన  మహాత్మా గాంధీని సందర్శించి ఆయన బోధనలకు  ప్రభావితులయ్యారు. చిన్నవయసులోనే బ్రిటిష్ వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలారు కాసుబ్రహ్మానందరెడ్డి. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఈయన. 

 

 దీవి శ్రీనివాస దీక్షితులు జననం : ప్రముఖ రంగస్థల సినిమా నటుడు రంగస్థల దర్శకుడు అయిన  దీవి శ్రీనివాస దీక్షితులు 1956 జూలై 28 వ తేదీన జన్మించారు. నాటకాల పై ఆసక్తి తో లెక్చరర్  ఉద్యోగాన్ని  వదిలేసి హైదరాబాద్ వచ్చి ఎన్నో నాటకాలు వేశారు. ఇక నాటక ప్రదర్శనల్లో  ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న దీవి శ్రీనివాస దీక్షితులు... ఆగమనం అనే ధారావాహికలో కూడా నటించారు ఇక ఈ సీరియల్ కు ఎన్నో నంది అవార్డులు కూడా లభించాయి. అంతే కాకుండా పలు టీవీ ఛానల్స్  లో ధారా వాహిక ల్లో  కూడా నటించారు. ఇక స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించారు శ్రీనివాస దీక్షితులు.

 

 కృష్ణవంశీ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు.. కృష్ణవంశీ 1962 జూలై 28 వ తేదీన జన్మించారు. తొలి చిత్రం గులాబీ తోనే మంచి పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. నటి రమ్యకృష్ణ ని పెళ్లి చేసుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి టాలెంటెడ్ దర్శకుడు గా  కృష్ణవంశీ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమా తీసిన కృష్ణవంశీ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలని  అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్గ్రీన్ గా నిలిచే సింధూరం సినిమా ఈయన  దర్శకత్వంలో వచ్చిందే.

 

 దుల్కర్ సల్మాన్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ 1986 జూలై 28 వ తేదీన జన్మించారు. తమిళ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా ఓ వెలుగు వెలిగి సినీ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మమ్ముట్టీ తనయుడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ కి తమిళ మలయాళ భాషల్లోనే కాకుండా హిందీ తెలుగు భాషల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఎంతగా

నో గుర్తింపు సంపాదించారు దుల్కర్ సల్మాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: