హెరాల్డ్ బర్త్ డే : 27-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 27 వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి.మరి  ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 సంగం లక్ష్మీబాయి జననం  : స్వాతంత్ర సమరయోధురాలు.. లోక్ సభ సభ్యురాలు అయిన  సంగం లక్ష్మీబాయి 1911 లో 27వ తేదీన జన్మించారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభ కు  ఎన్నికైన తొలి మహిళగా  లక్ష్మీబాయి చరిత్ర సృష్టించారు. ఒక కుగ్రామంలో జన్మించిన సంగం బాయ్ కి బాల్యంలోనే వివాహం చేయడం ఆ తర్వాత భర్త చనిపోవడంతో ఆమె అనాధ గా మారిపోయింది. తర్వాత ఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. ఆ తర్వాత ఈ ఆంధ్రమహిళాసభ ఉద్యమాల్లో ఎంతో మంది మహిళలను భాగస్వాములను చేసింది సంగం లక్ష్మీబాయి. సాంఘిక సేవకు అంకితం అయ్యారు సంగం లక్ష్మీబాయి, 1952 లో  నిజాంబాద్ జిల్లా బాన్సువాడ నుంచి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు, కాంగ్రెస్ సభ్యురాలు గా లోక్ సభలో కూడా అడుగు పెట్టారు సంగం లక్ష్మీబాయి, స్త్రీలు బాలికల సంక్షేమం కోసం నిర్విరామంగా శ్రమించి జీవితాన్ని మొత్తం వారికి సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేశారు.

 

 సాయి కుమార్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సాయి కుమార్ 1960 జూలై 27 వ తేదీన జన్మించారు. సాయి కుమార్ తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి ఆ తరువాత నటుడిగా ఎదిగారు, సాయికుమార్  డబ్బింగ్ చెప్పిన తొలి చిత్రం ఎన్టీఆర్ ఏఎన్నార్ నటించిన సంసారం అనే సినిమా. బాలనటుడిగా  సాయికుమార్ చేసిన తొలి సినిమా దేవుడు చేసిన పెళ్లి. అందుడి పాత్రలో నటించిన సాయికుమార్ తన నటనతో ఎన్నో ప్రశంసలు పొందాడు. ముందుగా కన్నడ చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలకు డబ్బింగ్ చెబుతూనే ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు సాయికుమార్. 

 

 చిత్ర జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన సుప్రసిద్ధ నేపథ్య గాయని చిత్ర 1963 జూలై 27 వ తేదీన జన్మించారు. గాయనిగా భారతీయ చిత్ర పరిశ్రమలో చిత్ర ప్రస్థానం ఎంతో అద్భుతంగా సాగింది అని చెప్పాలి. తెలుగు మలయాళం కన్నడ ఒరియా హిందీ బెంగాలీ భాషలో ఎన్నో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు చిత్ర. ముందుగా మలయాళ చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం మొదలుపెట్టిన చిత్ర ఆ తర్వాత ఇళయరాజా నేతృత్వంలో ఎన్నో పాటలు పాడి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆమె గాత్రం తో ఎంతో మంది సంగీత ప్రేక్షకులను ఉర్రూతలూగించారు చిత్ర. అంతేకాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. 

 

 కృతి సనన్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కృతి సనన్  1990లో జూలై 27వ తేదీన జన్మించారు. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన కృతి సనన్ ఆ తర్వాత హీరోయిన్ గా అవతారమెత్తింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ గా కొనసాగుతుంది.  అయితే కృతి సనన్ హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు హీరోగా నటించిన వన్  నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతిసనన్... నాగచైతన్య తో కలిసి ఓ సినిమాలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: