హెరాల్డ్ బర్త్ డే : 25-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 25 వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే.. ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి, ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 


 భారత రాష్ట్రపతి : జూలై 25 వ తేదీన భారత రాష్ట్రపతిగా వివిధ సంవత్సరాలలో  పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకరం చేశారు.. 1977లో నీలం  సంజీవరెడ్డి, 1982లో జ్ఞాని జైల్ సింగ్, 1987లో ఆర్ వెంకటరమన్,  1992లో శంకర్ దయాల్ శర్మ, వందల 1995 లో కేఆర్ నారాయన్ , 2002 లో ఏపీజే అబ్దుల్ కలాం, 2005లో ప్రతిభాపాటిల్ అందరూ జూలై 25 వ తేదీన  రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకరం చేశారు. 

 


కైకాల  సత్యనారాయణ  జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు భారత పార్లమెంటు సభ్యులు అయిన  కైకల సత్యనారాయణ 1935 జూలై 25 వ తేదీన జన్మించారు. దాదాపు నలభై సంవత్సరాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కైకల సత్యనారాయణ. 777 సినిమాల్లో నటించారు కైకల సత్యనారాయణ. పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రల్లో నటించి  పాత్రలకు ప్రాణం పోసే విధంగా తన నటనతో మెప్పించారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలో నటించడంతో పాటు ప్రతినాయకుడి  పాత్రల్లో  కూడా నటించారు. ఈయన  నటనకుగాను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు కూడా పొందారు కైకాల సత్యనారాయణ. 

 

 నారా రోహిత్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అయిన నారా రోహిత్ 1984 జూలై 25 వ తేదీన జన్మించారు. మీడియా వర్క్స్ సంస్థ అధినేత అయిన నారా రోహిత్.. బాణం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సోలో,  ప్రతినిధి, రౌడీ ఫెలో,  అసుర అనే సినిమాలో నటించారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు టిడిపి అధినేత నారా చంద్రబాబు పెద్దనాన్న వరస అవుతాడు. 

 

 వంశీ పైడిపల్లి జననం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి 1979 జూలై 25 వ తేదీన జన్మించారు. 2010లో బృందావనం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా  పరిచయమయ్యారు వంశీ పైడిపల్లి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బృందావనం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2014లో రామ్ చరణ్ తో ఎవడు.. 2016లో నాగార్జున కార్తీ హీరోలుగా ఊపిరి సినిమాను తెరకెక్కించారు. గతేడాది మహేష్ బాబుతో మహర్శి  సినిమాను తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కొన్ని సినిమాలే అయినప్పటికీ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: