హెరాల్డ్ బర్త్ డే : 26-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 26వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి  చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 


 ప్రగడ కోటయ్య జననం : ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు చేనేత పరిశ్రమ రక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు ప్రగడ కోటయ్య 1915 లో 26వ తేదీన జన్మించారు. 1937 లో  గుంటూరులో జరిగిన చేనేత మహాసభలను  వెనకుండి నడిపించింది ఈయనే . చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో సూచనలు సలహాలు ఇవ్వడంతోపాటు ఎంతగానో పోరాటం చేశారు. కార్మికులందరికీ చాలి నంత నూలు సరఫరా చేయాలని నూలు ధరలు అదుపులో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

 

 గులాబ్ రాయి రామ్ చంద్ జననం   : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయినా గులాబ్ రాయి  రామ్ చంద్  1927 జులై 26వ తేదీన జన్మించారు.  భారత క్రికెట్ జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించారు  ఈయన. ఆస్ట్రేలియాలో  ఆడిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఈయన  భారత జట్టుకు విజయాన్ని అందించారు. ఈయన  టీమిండియాకు సారథిగా వ్యవహరించిన మ్యాచ్ లలో  విజయం సాధించిన ఓకే ఒక సిరీస్ ఇదే కావటం గమనార్హం.

 

 కోనేరు రంగారావు జననం  : రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి అయిన కోనేరు రంగారావు 1935 జూలై  26వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా కోనేరు రంగారావు విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగించారు.  కాంగ్రెస్ పార్టీ హయాంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో  ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేసారు ఈయన. 

 

 అభిరామి జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి నేపథ్యగాయని అయిన  అభిరామి 1983 జూలై 26 వ తేదీన జన్మించారు. మలయాళం,  తమిళం,  తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించారు అభిరామీ . అంతేకాకుండా నేపథ్యగాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: