హెరాల్డ్ బర్త్ డే : 23-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 23వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 బాలగంగాధర్ తిలక్ జననం : భారత జాతీయోద్యమ పిత గా పేరుగాంచిన బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన జన్మించారు. దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలందరూ  ఉద్యమంలో పాల్గొనేలా చేయడం లో బాలగంగాధర్ తిలక్ పాత్ర  ఎంతగానో చెప్పుకోదగింది. ఈయన భావాలతో జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించారు.  బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంలో వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో  బాలగంగాధర్ తిలక్ మూలకారకుడు చెబుతుంటారు. శాంతి తో  కాదు స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గం అని నమ్మి... బ్రిటిష్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని నేను పొందుతాను అంటూ గర్జించాడు. సింహంలా గర్జించి  ఎంతో మందిని చైతన్య పరుస్తూ పోరాటం వైపు నడిపించారు బాలగంగాధర్ తిలక్. 

 

 చంద్రశేఖర్ ఆజాద్ జననం : భారతీయ స్వతంత్ర ఉద్యమకారుడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి వాళ్ళ సహచరుడు  చంద్రశేఖర్ ఆజాద్. 1906 జులై 23వ తేదీన జన్మించారు ఈయన.  మహాత్మాగాంధీ స్వాతంత్రం కోసం చేస్తున్న సహాయ నిరాకరణోద్యమం సమయంలో తాను కూడా దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్. 15 ఏళ్ళ  వయసులోనే ఎంతో ఉత్సాహంగా ఉద్యమాల వైపు నడిచాడు. ఈయన  స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టారు. ఈ సమయంలో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఎంతో పౌరుషం గా సమాధానాలు చెప్పారు. పేరు అడిగితే ఆజాద్ అని తన తండ్రి  పేరు అడిగితే స్వాతంత్రం అని... ఇళ్లు ఎక్కడ  అని అడిగితే జైలు అంటూ సమాధానమిచ్చారు చంద్రశేఖర్ ఆజాద్. 

 

 హిమేష్ రేష్మి జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు.. సంగీత దర్శకుడు నటుడు అయిన హిమేష్ రేష్మి భారతీయ సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు . 1973 జూలై 23వ తేదీన జన్మించారు. ఇక ఎన్నో సినిమాల్లో తనదైన మ్యూజిక్ తో ఎంతో మంది ప్రేక్షకును  ఉర్రూతలూగించారు . నటుడిగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 

 

 సూర్య జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు.. గాయకుడు నిర్మాత అయిన సూర్య 1975 జూలై 23వ తేదీన జన్మించారు. సూర్య పూర్తి పేరు సూర్య శివ కుమార్. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు సూర్య. తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు కన్నడ సినిమాల్లో కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. సహా నటి అయిన జ్యోతిక ను వివాహం చేసుకున్నారు. సూర్య జ్యోతిక కు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ ఇండస్ట్రీ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సూర్య... ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: