హెరాల్డ్ బర్త్ డే : 21-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 21వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 పోనంగి శ్రీరామ అప్పారావు జననం  : నాటకకర్త, అధ్యాపకుడు,  నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన పోనంగి శ్రీరామ అప్పారావు 1923 జూలై 21 వ తేదీన జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన పోనంగి శ్రీరామ అప్పారావు.. నాటక వికాసం అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. తెలుగు నాటకరంగాన్ని గుర్తించిన సర్వ సమగ్రమైన గ్రంథం తెలుగు నాటక వికాసం, ఇప్పటికి కూడా నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది ఈ గ్రంథం. 

 

 అమర్ సింగ్ చంకీలా జననం : ప్రముఖ పంజాబీ గాయకుడు,  గేయ రచయిత,  సంగీత వాయిద్య కారులు, సంగీత దర్శకుడు అయిన అమర్ సింగ్ చంకీలా 1961 జూలై 21 వ తేదీన జన్మించారు. ముఖ్యంగా వేదికల్లో పాటలు పాడడంతో  చంకీలా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. అమర్ సింగ్ చంకీలా పాటల్లో  ఎక్కువగా పల్లెవాసుల జీవనవిధానం కనబడుతూ ఉంటుంది. పల్లెలోని అక్రమ సంబంధాలు,  మద్యపానం,  మత్తుపదార్థాల వాడకం లాంటి వాటిని పాటల  ద్వారా వ్యక్త పరుస్తూ ఉంటారు అమర్ సింగ్ చంకీలా. 

 

 శంకర్ సిన్హ్  వాఘేలా జననం : గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన శంకర్ సిన్హ్  వాఘేలా  1940 జూలై 21వ తేదీన జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో పదవులను కూడా అలంకరించారు. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా కొనసాగుతున్న సమయంలో తనదైన పాలన సాగిస్తూ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

 

 అనురాధ జననం : 1980లలో ప్రముఖ తెలుగు నృత్యతార అయిన అనురాధ 1966 జూలై 21వ తేదీన జన్మించారు. అప్పటి నృత్య తారలైన జయమాలిని, సిల్క్ స్మిత,  డిస్కో శాంతి లకు పోటీ ఇచ్చి  అనురాధ ఎంతో  గుర్తింపు సంపాదించారు. ఇక ఎన్నో పాటల్లో నృత్యం చేసి  తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు, ఇక 1985 తర్వాత పెళ్లితో సినిమాలకు దూరమయ్యారు. 2007లో ఆట అనే సినిమా ద్వారా ప్రతినాయక ఛాయలున్న పాత్ర ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు అనురాధ. పదమూడు సంవత్సరాల వయసులోనే సినీ  రంగం లోకి అడుగుపెట్టారు అనురాధ.  సుమారు ముప్పై ఐదు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా కొన్ని  ధారావాహికల్లో  కూడా నటించింది అనురాధ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: