హెరాల్డ్ బర్త్ డే : 20-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 20వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి . మరొక్కసారి చరిత్ర పుటల్లోకి వెల్లి చూసి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

రొద్దం నరసింహ జననం : భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ఫ్లూయిడ్  డైనమిక్స్ లో నిపుణుడు అయిన రొద్దం  నరసింహ 1933 జూలై 20వ తేదీన జన్మించాడు. ఎయిరో  స్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా , నేషనల్ ఎయిరో స్పేస్ ఏరోస్పేస్ లాబరెటరీ  డైరెక్టర్గా... బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ కేంద్రంలోని ఇంజినీరింగ్ మెకానిక్స్ యూనిట్ చైర్మన్గా పనిచేశారు రొద్దం  నరసింహ. ప్రస్తుతం ఈయన  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో గౌరవ ఆచార్యనిగా  కొనసాగుతున్నారు. భారత ప్రభుత్వం అతని సేవలకు మెచ్చి 2013 దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ తో సత్కరించింది. 

 

 గిరిజ ఎమ్మా  జనం : తెలుగు సినీ రంగంలో గిరజగా  పరిచయమైన గిరాజ ఎమ్మా  1969 జూలై 20వ తేదీన జన్మించారు, మణిరత్నం దర్శకత్వం వహించిన తెలుగు  సినిమా గీతాంజలిలో కథానాయికగా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అయ్యింది . వందనం అనే మలయాళ సినిమా ద్వారా చిత్ర రంగంలో నట ప్రారంభించింది గిరిజ. ఇక ఆ తర్వాత సినీరంగంలో గుర్తింపు సంపాదించిన గిరిజ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. 

 

ఎస్ జె  సూర్య జననం : భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సింగర్ డైరెక్టర్ అయిన ఎస్జె  సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు. సూర్య 1968 జూలై 20 వ తేదీన జన్మించారు. రచయితగా దర్శకుడిగా నటుడిగా కూడా తనను తాను నిరూపించుకున్నాడు ఎస్ జె  సూర్య . ఈయన  ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఎంతో  గుర్తింపు సంపాదించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన... స్పైడర్ సినిమాలు సైకో విలన్ పాత్రలో నటించి నట విశ్వరూపం తో తెలుగు ప్రేక్షకులను అందరినీ తన నటన తో మెప్పించారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి  సినిమాతో దర్శకుడిగా  తెలుగు ప్రేక్షకులకు మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: