హెరాల్డ్ హిస్టరీ : 11-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జులై 11వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో   తెలుసుకుందాం రండి. 

 

 సి.ఎస్.ఆర్.ఆంజనేయులు జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమా రంగస్థల నటుడు అయిన సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 1957 జూలై 11వ తేదీన జన్మించారు. అయితే చిన్నప్పటి నుంచే నాటకాల పట్ల ఎంతో ఆసక్తి కనపరిచిన ఆంజనేయులు... ఎన్నో  నాటకాలలో నటించే వారు. ఆ తరువాత చదువు పూర్తయ్యాక చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా నాటక రంగం వైపు అడుగులు వేశారు ఆంజనేయులు. రంగస్థలంపై కృష్ణుడుగా శివుడుగా ఎన్నో పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ఈస్టిండియా ఫిలిం కంపెనీ 1933 లో నిర్మించిన రామదాసు అనే సినిమాలో హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాయిగా నిలిచిన మాయాబజార్ సినిమాలో శకుని  పాత్రల్లో నటించారు ఆంజనేయులు. 

 

 రామకృష్ణ జననం : తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యంగ్య చిత్రకారులలో ఒకరైన రామకృష్ణ 1946 జూలై 11వ తేదీన జన్మించారు, ఈయన  పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ. ఈయన  తెలుగులోనే కాకుండా ఆంగ్లంలో కూడా ఎన్నో కార్టూన్లు వేశారు, ప్రముఖ చిత్రకారుడు అయిన బాపు ప్రభావంతో వ్యంగ్య  చిత్రానికి ఆకర్షించబడిన మరొక మంచి చిత్రకారుడు రామకృష్ణ. ఓవైపు భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకు మేనేజర్ గా పని చేస్తూనే మరోవైపు కార్టూనిస్టుగా కూడా ఎంతగానో పేరుప్రఖ్యాతులు సంపాదించాలి. 

 

 మణి శర్మ జననం  : తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంగీత దర్శకుడు మణిశర్మ.ఈయన  పేరు పూర్తి పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఈయన 1964 జూలై 11వ తేదీన జన్మించారు. మణి శర్మ తన స్వరాలతో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో  ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించారు, తమిళం తెలుగు చిత్ర పరిశ్రమలో కలిపి మొత్తంగా 200కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు మణిశర్మ. మ్యూజిక్ డైరెక్టర్ సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించి మణిశర్మ ఆ తర్వాత ఎంఎం  కీరవాణి , కోటి ల దగ్గర శిష్యరికం కూడా చేశారు, సూపర్ హీరో సినిమా ద్వారా సంగీత దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు మనిశర్మ , ఇక ఆ తర్వాత మరెన్నో సినిమాలకు  సంగీతం అందించి  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 
,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: