హెరాల్డ్ బర్త్ డే : 10-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 10వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి.  మరి ఒక్కసారి చరిత్రపుటల్లో వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 కోన  ప్రభాకర్ రావు జననం  : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభాపతి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య రాజకీయ నాయకుడు.. 1940లలో తెలుగు సినిమా నటుడు దర్శకుడు నిర్మాత అయిన కోన ప్రభాకరరావు 1916 జూలై 10వ తేదీన జన్మించారు. 1967 లో మొదటి సారి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు ఈయన . ఆ తర్వాత వరుసగా మూడుసార్లు బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పట్లో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి గవర్నర్ గా కూడా పనిచేశారు ఈయన. 

 

 జస్టిస్ అమరేశ్వరి జననం : భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి అయిన జస్టిస్ అమరేశ్వరీ  1928 జూన్ 10 వ  తేదీన జన్మించారు. గుంటూరులో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అమరేశ్వరి 14వ ఏటనే పెళ్లి జరిగినప్పటికీ భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించారు.  న్యాయశాస్త్రంలో పట్టా పొంది మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం లో 1978 ఏప్రిల్ 29వ తేదీన న్యాయమూర్తిగా నియమితులయ్యి  దేశంలోనే తొలి మహిళా న్యాయమూర్తి గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 


 కోట శ్రీనివాసరావు జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అయినా కోట శ్రీనివాసరావు 1945 జూలై 10వ తేదీన జన్మించారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కోట శ్రీనివాసరావు చిన్నప్పటి  నుంచి నాటకాలు అంటే  ఎంతో ఆసక్తి కనబరిచాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా.. మూడు దశాబ్దాల పాటు తన నటన ప్రస్థానాన్ని  విజయవంతంగా కొనసాగించారు కోటా శ్రీనివాసు రావు . ముఖ్యంగా విలన్ పాత్రలకు ప్రాణం పోసిన కోట శ్రీనివాసరావు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సహాయ నటుడిగా కూడా పనిచేశారు. ఇక ఈ నటనకు  గాను ఎన్నో అవార్డును సైతం అందుకున్నారు. ఆయన సినీరంగంలో చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 


 సునీత గవాస్కర్ జననం : భారత క్రికెట్ చరిత్రలో లిటిల్ మాస్టర్ గా ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన దిగ్గజ క్రికెట్ మాజీ క్రీడాకారుడు అయినా సునీల్  గవాస్కర్  1949 జూలై 10వ తేదీన జన్మించారు. 1970 - 80 లలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ గా తన అపూర్వ సేవలందించారు సునీల్ గవాస్కర్. ఇక తన క్రికెట్ ప్రస్థానంలో 34 టెస్ట్ సెంచరీల సాధించి  అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా  ప్రపంచ రికార్డు సాధించారు.ఈ  రికార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2005 డిసెంబర్లో తిరగరాశారు. భారత క్రికెట్ లో  ఎంతగానో ప్రతిభ కనబరిచి ఎన్నో విజయాలకు వారధిగా మారాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: