హెరాల్డ్ బర్త్ డే : 07-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 7వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి

 


 కళా వెంకటరావు జననం : స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అయిన కళా వెంకటరావు 1900 సంవత్సరంలో జూలై 7వ తేదీన జన్మించారు. 1921లో బీఏ చదువుతున్న సమయంలోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు, శాసనోల్లంఘన ఉద్యమం సత్యాగ్రహం లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు, 1951 59 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టిన ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 

 

 కొమ్మూరి పద్మావతీదేవి జననం  : తెలుగులో ఎంతో ప్రసిద్ధిగాంచిన తొలి తరం రంగస్థల నటి కథారచయిత అయిన కొమ్మూరి పద్మావతీదేవి 1908 జూన్ 7వ తేదీన జన్మించారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించారు ఈమె.  సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించి సాంప్రదాయ సంకెళ్లను తెంచుకుని నాటకరంగం మీద  ఆసక్తి పెట్టింది   కొమ్మూరు పద్మావతి. ఎన్నో నాటకాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది. 

 

 మహేంద్ర సింగ్ ధోనీ జననం : ఎంతో ప్రఖ్యాతి గాంచిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని 1981 జులై 30వ తేదీన జన్మించారు. భారత క్రికెట్ ప్రేక్షకుడి మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆటగాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కు సాధ్యం కానీ రెండు ప్రపంచ కప్ లను  భారత జట్టు అందించిన గొప్ప సారథి. బ్యాట్ మెన్ గా  వికెట్ కీపర్గా కీలక ఆటగాడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అంతేకాదు పరిమిత ఓవర్లలో గొప్ప ఫినిషర్ గా కూడా మహేంద్రసింగ్ ధోని ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. రాహుల్ ద్రావిడ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారు మహేంద్రసింగ్ ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: