హెరాల్డ్ బర్త్ డే : 06-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జులై 6వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఎంటో  తెలుసుకుందాం రండి. 

 

 శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం  : జాతీయవాద నేతలతో ప్రముఖుడు అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జులై 6వ తేదీన జన్మించారు. 1951 లో భారతీయ జనసేన పార్టీ స్థాపించిన మొదటి ఆధునిక హిందుత్వం హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించే వారు.జనసేన  స్థాపించి దేశంలో తొలి హిందూ వాద రాజకీయ పార్టీని స్థాపించిన మొదటి స్థానం సంపాదించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ. భారతీయ జాతీయ కాంగ్రెస్ తరపున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యారు, ఆ తర్వాత సంవత్సరమే శాసనసభ భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసారు . 


 మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం : కర్ణాటక సంగీత గాయకుడు వయోలిన్ విద్వాంసుడు వాగ్గేయకారుడు  సినీ సంగీత దర్శకుడు గాయకుడు అయిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1935 జూలై 6 న జన్మించాడు. ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి సరికొత్త రికార్డును సృష్టించాడు. 8 సంవత్సరాల చిన్న వయసు నుంచే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అని గుర్తింపు తెచ్చుకున్నాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. చిన్నప్పటి  నుంచి అతను ప్రొఫెషనల్ కచ్చేరీలు చేస్తూనే ఉన్నాడు. భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా నటించారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఈయన  చేసిన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అంతే కాకుండా ఎన్నో విశ్వవిద్యాలయాలతో నుంచి డాక్టరేట్ ను కూడా పొందారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. 

 

 మాలావిక జననం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపధ్య గాయని అయిన మాళవిక 1988 జూలై 6 వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనిగా ఎంతగానో గుర్తింపు సంపాదించింది.  శ్రీరామదాసు సినిమా లో హోలెస్స అనే  పాట పాడి మరింత గుర్తింపు సంపాదించి అవార్డులను సైతం అందుకున్నారు మాళవిక. ఆ తర్వాత తన సహా గాయకుడు అయిన కృష్ణ చైతన్య ను  పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: