హెరాల్డ్ బర్త్ డే : 05-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 5వ తేదీన ఒక చరిత్రలోకి వెళితే  ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి.  మరొక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 


 ఘంటసాల బలరామయ్య జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు ఘంటసాల బలరామయ్య 1906 జులై 5వ తేదీన జన్మించారు. ఘంటసాల బలరామయ్య తో పాటు  ఆయన సోదరుడు కి  కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఇద్దరు కలిసి 1933లో కలకత్తా లో  చిత్రరంగంలో అడుగుపెట్టింది అక్కడ శ్రీరామ్ ఆర్ట్ ఫిలిమ్స్ అనే నిర్మాణ కంపెనీ స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలని  నిర్మించారు, 1944 నిర్మించిన సీతారామ జననం చిత్రం ద్వారా అక్కినేని నాగేశ్వరావు అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు ఘంటసాల బలరామయ్య. 1953 అక్టోబర్ 29న గుండెపోటుతో పరమపదించారు. 


 కళ్యాణ్ రామ్ జననం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఈయన 1980 జూలై 5వ తేదీన జన్మించారు. కళ్యాణ్ రామ్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ మనవడు నందమూరి హరికృష్ణ కుమారుడు. బాల నటుడిగా పలు సినిమాలలో నటించిన నందమూరి కళ్యాణ్ రామ్  ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యి  ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. తొలిచూపులోనే అనే సినిమాతో 2003లో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు కళ్యాణ్ రామ్ . ఆ తర్వాత ఎన్నో  సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నారు, 

 

 పీవీ సింధు జననం :  భారత దేశానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి... భారత ప్రజలందరి ఆశాజ్యోతి భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహిళా మణి... ఒలం పిక్స్ లో బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించింది ఈ పథకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది గొప్ప క్రీడాకారిణి పి.వి.సింధు 1995 జూలై 5 వ తేదీన జన్మించారు. బ్యాట్మెంటన్ క్రీడలో ఎంతగానో ప్రతిభ కనబరిచి ఏకంగా ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ర్యాంక్స్  లో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఇప్పటివరకు భారతదేశంలో  ఏం క్రీడాకారినికి సాధ్యం కాని సరికొత్త రికార్డులను నెలకొల్పి ఎన్నో విజయాలను అందుకుంది. సింధు క్రీడా స్ఫూర్తికి మెచ్చి భారత ప్రభుత్వం ఏకంగా సింధు కి పద్మశ్రీని కూడా ప్రదానం చేసింది.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: