గజ్జి, తామరని ఈజీగా తగ్గించే సూపర్ టిప్?

Purushottham Vinay
గజ్జి, తామర మనల్ని ఎంతలా వేధిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చర్మ సమస్యలతో మనలో చాలా మంది కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఫంగల్ ఇన్ ఫెక్షన్ ల వల్ల వచ్చే ఈ సమస్యలు ఒకరి నుండి మరొకరికి ఈజీగా వ్యాపిస్తాయి.ఈ సమస్యల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఈ సమస్యలతో చాలా మంది కూడా ఎంతో అవస్థ పడుతూ ఉంటారు.చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కానీ కొందరిలో ఈ సమస్యలు అస్సలు తగ్గవు. చాలా కాలంగా వేధిస్తున్న ఈ గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను మనం ఒక చక్కటి చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చిట్కాను వాడడం ఇంకా అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ.ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి  మనం పచ్చి బొప్పాయిని, పసుపు, అలోవెరా జెల్ ను ఇంకా విటమిన్ ఇ క్యాప్సుల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక పచ్చి బొప్పాయిని తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేయాలి. ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.


తరువాత ఈ పేస్ట్ ను రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ఇంకా ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు గజ్జి ఇంకా తామర వంటి సమస్యలు ఉన్న భాగాన్ని వేడి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత అక్కడ ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రెండు గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ టిప్ ని క్రమం తప్పకుండా సమస్య తగ్గే దాకా వాడాలి. ఈ టిప్ ని వాడిన రెండు రోజుల్లోనే సమస్య తగ్గడాన్ని మనం గమనించవచ్చు.అలాగే పచ్చి బొప్పాయి, పసుపు, కలబంద జెల్ లో యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గజ్జి, తామర వంటి సమస్యలను తగ్గించడంలో చాలా అద్భుతంగా పని చేస్తాయి. ఈ టిప్స్ పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ విధంగా ఈ చిట్కాను వాడి ఎంతో కాలంగా వేధిస్తున్న గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: