ఈ షాంపు వాడితే బట్టతల మటుమాయం?

Purushottham Vinay
పురుషులను భయపెట్టే అతి పెద్ద సమస్య ఏంటంటే బట్టతల.ఇక వయసు పైబడిన తర్వాత బట్టతల వచ్చిన పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పాతిక  ఏళ్లకే బట్టతల బారిన పడుతున్నారు.పని ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇంకా పెరిగిన కాలుష్యం వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే చాలా మంది బట్టతల సమస్యకు గురవుతున్నారు. దీని వల్ల పురుషులు మానసికంగా కృంగిపోతుంటారు.అందులో కూడా పెళ్లి కాని వారు అయితే ఇంకా ఎక్కువ బాధ పడుతుంటారు. అయితే బట్టతల వచ్చాక బాధపడటం కంటే అసలు ఈ సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మేలు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో తలకి షాంపూ  చేసుకుంటే పురుషులకు బట్టతల రానే రాదు. మరి ఇంకెందుకు ఆలస్యం బట్టతలకు దూరంగా ఉండాలంటే ఎలా షాంపూ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా మీరు ఒక గ్లాసు బియ్యం కడిగిన వాటర్ ను తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ లో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. అవి జుట్టు ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా రకాల మేలు చేస్తాయి. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ఇంకా అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ ని ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇక వారానికి రెండు సార్లు ఈ విధంగా తలస్నానం చేస్తే బట్టతల వచ్చే రిస్క్ అనేది  ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గు ముఖం పడుతుంది. జుట్టు కుదుళ్లు చాలా దృఢంగా మారతాయి. హెయిర్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ అవుతుంది.ఇంకా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య ఉంటే చాలా ఈజీగా దూరం అవుతుంది. ఇంకా హెయిర్ డ్యామేజ్ కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి బట్టతల సమస్యకు దూరంగా ఉండాలని భావించే పురుషులు తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధంగా తలకి షాంపూ చేసుకొండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: