ఇలా చేస్తే జుట్టు ఎప్పటికి తెల్లబడదు?

Purushottham Vinay
తెల్ల జుట్టు అనేది ఖచ్చితంగా వృద్ధాప్యానికి సంకేతం.అందరికి కూడా వయసు పైబడే కొద్ది జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ కొందరి జుట్టు మాత్రం వయసు పైబడిన కానీ ఇంకా నల్లగానే మెరుస్తుంది.అలాంటి వారి జుట్టు చూసినప్పుడు మనకు కూడా బాధ కలుగుతుంది. కానీ మీరు కూడా అలా నల్ల జుట్టును పొందాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే హెల్తీ ఆయిల్ ని ఖచ్చితంగా వాడండి. మీరు ఈ ఆయిల్ ను వాడితే 60 సంవత్సరాలు వచ్చినా మీ జుట్టు ఇంకా నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఎండిన కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ డ్రై రోజ్మేరీ, రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరికాయ ముక్కలు ఇంకా ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో అర గ్లాసు కొబ్బరి నూనె ఇంకా అర గ్లాసు బాదం నూనె వేసుకోవాలి.


ఇక ఆ ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి స్లో ఫ్లేమ్ పై పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను పన్నెండు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తరువాత స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకొని.. ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు షాంపూతో శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే మెలనిన్ ఉత్పత్తి ఈజీగా పెరుగుతుంది. దాంతో అరవై ఏళ్ల వయసులో కూడా మీ జుట్టు నల్లగా మెరుస్తుంది. ఇంకా అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. బట్టతల వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.ఇంకా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో జుట్టు ఒత్తుగా ఇంకా పొడుగ్గా కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: