జుట్టు చిట్లిపోకుండా ఇలా చెయ్యండి?

Purushottham Vinay
వేసవి కాలంలో జుట్టు సమస్యలు రావడం చాలా సర్వసాధారణమైపోయింది. వాతావరణంలో కాలుష్యం పెరగడం వల్ల చాలా మందిలో కూడా జుట్టు చిట్లిపోతోంది.ఇటువంటి సమస్యల వల్ల పురుషుల్లో బట్టతల సమస్యలు వస్తున్నాయి. వేడి నీటి స్నానం ఇంకా హెయిర్ కలరింగ్ కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.కాబట్టి ఇటువంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కూడా మానుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా జుట్టు చిట్లిపోవడం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక జుట్టు సమస్యలను తగ్గించడానికి నల్ల పెసర్ల పప్పులతో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌ చాలా ప్రభావంతంగా సహాయపడుతుంది.ఇందులో ఉండే గుణాలు తీవ్ర జుట్టు సమస్యలను తగ్గించేందుకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది.


ఈ మాస్క్‌ను తయారు చేయడానికి ఒక చిన్న కప్పు నల్ల పెసరి పప్పును మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత కప్పులతో నీటి వేసి రాత్రంతా కూడా అలాగే నానబెట్టి ఉంచాలి. ఇక ఆ తర్వాత నల్ల పెసరి పప్పును గ్రైడర్‌ వేసి మిశ్రమంలాగా తయారు చేయాల్సి ఉంటుంది.ఇక ఆ తర్వాత ఇందులో 7-8 చెంచాల పెరుగు వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత జుట్టుకు అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.ఇంకా అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా చాలా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఒక బౌల్‌ తీసుకోని  అందులో అరకప్పు పెరుగు ఇంకా 6 చెంచాల తేనె మిక్స్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుని మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తేలికపాటి చేతులతో జుట్టుకు బాగా మసాజ్‌ చేయాలి. ఇక ఆ తర్వాత ఒక గంట పాటు అలాగే ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత జుట్టును సాధరణ షాంపూతో శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: