ఈ టిప్ పాటిస్తే జుట్టు సమస్యలు రానే రావు?

Purushottham Vinay
చుండ్రు సమస్యతో ఇంకా అలాగే పలుచబడిన జుట్టుతో బాధ పడేవారు నెలకు కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవ్వడమే కాదు..జుట్టు ఒత్తుగా ఇంకా పొడుగ్గా కూడా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక అలోవెరా ఆకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలని వేసుకోవాలి. ఇంకా అలాగే వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి అలాగే టేబుల్ స్పూన్ శీకాకై పొడి, రెండు తుంచిన మందారం ఆకులు ఇంకా అలాగే అర కప్పు పెరుగు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.


ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా బాగా పట్టించి.. షవర్ క్యాప్ ని ధరించాలి. ఒక గంట లేదా గంటన్నర తరువాత మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో చాలా శుభ్రంగా తలస్నానం చేయాలి. నెలకు కేవలం రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే క్రమంగా ఈజీగా మాయం అవుతుంది. ఇంకా అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గి ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. పైగా ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా చాలా చిన్న వయసులోనే ఈ తెల్ల జుట్టు సమస్యతో బాగా బాధపడుతున్నారు. అయితే ఈ రెమెడీని కనుక పాటిస్తే మన జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. ఇంకా వయసు పైబడిన కూడా కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించండి. చుండ్రు, తెల్ల జుట్టు, ఇంకా జుట్టు పొడిబారిపోవడం వంటి సమస్యలని ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: