తెల్ల జుట్టుని మాయం చేసే సూపర్ రెమెడీ?

Purushottham Vinay
మనకు మన గ్రామాల్లో ఎక్కువగా కనిపించే వివిధ రకాల చెట్టల్లో నీలి చెట్టు కూడా ఒకటి. దీనినే ఇంగ్లీష్ లో ఇండిగో చెట్టు అని పిలుస్తారు.ఈ చెట్టు ఆకులు చాలా మంచివి. ఈ ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ నీలి చెట్టు కాయలు గుండ్రంగా ఉండి కాండానికి కాస్తాయి.వర్షాకాలంలో ఈ మొక్కలు చాలా ఎక్కువగా పెరుగుతాయి.మన పూర్వకాలంలో ఈ చెట్టు నుండి నీలి మందును తయారు చేసి బట్టలకు వేసేవారు. ఇలా నీలిమందు వేసిన బట్టలను ధరించడం వల్ల చర్మ వ్యాధులనేవి రాకుండా ఉంటాయి.ఇక ఈ చెట్టు ఆకులను ఉపయోగించి మనం తెల్ల జుట్టును చాలా ఈజీగా నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం ముందుగా నీలి చెట్టు ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టి వాటిని పొడిగా చేయాలి.అయితే ఈ నీటి చెట్టు ఆకుల పొడిని మన తలకు పట్టించడానికి ముందు మనం గోరింటాకును తలకు పట్టించాల్సి ఉంటుంది. ఈ గోరింటాకును నూరి తలకు పట్టించాలి. అది ఆరిన తరువాత షాంపు పెట్టకుండా శుభ్రంగా నీటితో కడిగి వేయాలి. తరువాత మరుసటి రోజు నీటి చెట్టు ఆకుల పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి.


ఈ పేస్ట్ ను వెంట్రుకలకు బాగా పట్టించి ఆరిన తరువాత శుభ్రంగా కడిగి వేయాలి. అయితే దీనిని ఉపయోగించిన వెంటనే వెంట్రుకలు నల్లగా మారవు.మరుసటి రోజు మనకు జుట్టు నల్లగా మారుతుంది.ఇలా చేయడం వల్ల మనం చాలా ఈజీగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనిని ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే మరో పద్దతి ద్వారా కూడా మనం జుట్టును ఈజీగా నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం నీలి చెట్టు ఆకుల రసాన్ని తీసుకోని దీనికి సమానంగా నువ్వుల నూనెను కలిపి చిన్న మంటపై నూనె మిగిలే దాకా మరిగించాలి. తరువాత ఈ నూనెను వడకట్టి స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజుకు రెండు పూటలా జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా తెల్ల జుట్టు ఈజీగా నల్లగా మారుతుంది. అయితే జుట్టు నల్లగా మారడానికి సమయం పట్టినప్పటికి నల్లగా మారిన జుట్టు శాశ్వతంగా నల్లగానే ఉంటుంది. ఇది పాముకాటుకు విరుగుడుగా కూడా  పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: