చుండ్రుని పోగొట్టే నూనె ఇదే?

Purushottham Vinay
 చుండ్రు సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం పొందడానికి కొన్ని రకాల హోమ్ టిప్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ నేపథ్యంలోనే ఆయుర్వేద నిపుణులు సూచించిన యాంటీ డాండ్రఫ్ ఆయిల్ అయిన 'ఆలివ్ ఆయిల్‌'ను వాడటం వల్ల సులభంగా చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రించుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఇంకా తేనె రెండింటినీ మిక్స్‌ చేసి స్కాల్ప్‌పై అప్లై చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు స్కాల్ప్ డ్రైనెస్ ని ఈజీగా తొలగించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్కాల్ప్‌పై ప్రతి సమస్య నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఈ నూనె తయారి విధానం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..


ఇక యాంటీ డాండ్రఫ్ ఆయిల్ ని తయారు చేయడానికి ఒక గిన్నెలో కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ ఇంకా తేనెను సమాన పరిమాణంలో వేసుకోవాలి. ఆ తరువాత ఈ రెండింటినీ బాగా కలుపుకొని మిశ్రమంలాగా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక చిన్న బాటిల్‌లో స్టోర్ చేసుకోవాలి.ఇక చుండ్రు సమస్యని తగ్గించడం కోసం యాంటీ డాండ్రఫ్ ఆయిల్‌ను మీ జుట్టుకు ఖచ్చితంగా అప్లై చేయాలి. ఆ క్రమంలో స్కాల్స్‌పై ఆలీవ్ ఆయిల్‌ను ఆప్లై చేసుకుని.. ముని వేళ్లతో సాఫ్ట్ గా మసాజ్ చేయండి.ఇక ఇలా అప్లై చేసిన తర్వాత జుట్టును వేడి టవల్‌తో చుట్టి, సుమారు ఒక 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ మొత్తం ఆరు చేస్తే చెయ్యాలి.అప్పుడు మీ చుండ్రు సమస్యకు శాశ్వాత పరిష్కారం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: