జుట్టు సమస్యలన్నింటిని తగ్గించే ఎఫెక్టివ్ టిప్?

Purushottham Vinay
ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం రెండంటే రెండు పదార్థాలను వాడి ఒక సింపుల్ టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా సులభంగా జుట్టు సమస్యలన్నింటిని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి ఉపయోగించే రెండు పదార్థాలు కూడా చాలా సహజ సిద్దమైనవే. కాబట్టి దీనిని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జుట్టు సమస్యలను నయం చేసే ఆ పదార్థాలు ఏమిటి… వాటితో ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలి…వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి మనం కలబంద గుజ్జును ఇంకా కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.ముందుగా మీరు కలబంద కాడను తీసుకుని దాని నుండి గుజ్జును వేరు చేయాలి. ఆ తరువాత దీనిని జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కలబంద మిశ్రమాన్ని  ఒక 4 టేబుల్ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కూడా వేసుకోవాలి.


ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. ఆ తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా బాగా మర్దనా చేసుకోవాలి.ఇంకా ఈ మిశ్రమాన్ని జుట్టుకు రెండు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. రెండు గంటల తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి.మీకు కుదిరితే ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు జుట్టుకు పట్టించి అలాగే ఉంచుకోవాలి.తరువాత పొద్దున్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం చాలా ఈజీగా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా అలాగే కాంతివంతంగా కూడా తయారవుతుంది. జుట్టు చిట్లడం, తెగడం కూడా తగ్గుతుంది. జుట్టుకు కావల్సిన పోషకాలు అందడం వల్ల జుట్టు ధృడంగా ఇంకా ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ విధంగా ఈ టిప్ పాటించడం వల్ల జుట్టు సమస్యలన్నింటిని చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: