డ్రై, ఆయిల్ స్కిన్ ని తగ్గించే అద్భుతమైన టిప్?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో మారిపోయిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఆరోగ్య పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో చర్మ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి.చర్మం పొడిబారినా లేదా ఆయిలీగా ఉన్నా నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఆ సమస్యలు తగ్గించుకునేందుకు ఏవేవో కాస్మటిక్స్ ని కూడా వాడుతుంటారు యువత. ఇక చలికాలంలో అయితే చర్మ సంరక్షణ అంటే మరింత సవాలుగా ఉంటుంది. అయితే చర్మ సంరక్షణ కోసం మన ఎప్పుడు వాడే కాఫీ పొడి మంచి మూలకంగా ఉపయోగపడుతుంది. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి డెడ్ స్కిన్ ని చాలా ఈజీగా తొలగించి చర్మాన్ని బాగా శుభ్రంచేస్తాయి.ఇంకా అలాగే దీంతోపాటు ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో కూడా బాగా సహాయపడుతాయి. కాఫీ ఫేస్ ప్యాక్‌కి కొంచెం కొబ్బరి లేదా బాదం నూనెను కలిపి అప్లై చేస్తే ఖచ్చితంగా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇది చాలా కాలం పాటు యవ్వనంగా వుండే ఇంకా మెరిసే చర్మాన్ని పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది.


ఇక కాఫీ ఫేస్ మాస్క్ ని తయారు చేయడానికి ముందుగా కాఫీ పొడిని తీసుకోండి. తరువాత దీనిని మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో తీసుకొని ఈ మిశ్రమానికి కొబ్బరి లేదా బాదం నూనెని కలపాలి. తరువాత ఈ రెండింటినీ బాగా మిక్స్‌ చేసుకుంటే దెబ్బకి కాఫీ ఫేస్‌మాస్క్ తయారవుతుంది. అయితే ఇది అప్లై చేసేముందు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.కాఫీ ఫేస్ మాస్క్‌ని అప్లై చేయడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఫేస్ మాస్క్‌ని ముఖంపై బాగా అప్లై చేసి సుమారు 15 నిమిషాలు పాటు ఉంచి ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని స్క్రబ్ చేస్తూ నీట్ గా క్లీన్ చేయాలి.తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని క్లీన్ చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా కొన్ని క్రీమ్ లేదా లోషన్‌ను అప్లై చేయాలి. ఇలా వారంలో ఒకటి లేదా రెండుసార్లు చేస్తే ముఖం ఖచ్చితంగా చాలా మృదువుగా మారుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: