ఈ చిన్న టిప్స్ పాటిస్తే అన్ని ముఖ సమస్యలు మాయం?

Purushottham Vinay
ముఖాన్ని అందంగా మార్చడానికి కుంకుమ పువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది.తులసితో పాటు కుంకుమపువ్వును వాడటం వల్ల మొటిమలు ఉన్నవారికి ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం, ఔషధాల గనిగా భావించే తులసి ఆకులను గ్రైండ్ చేసి, దాన్ని కొద్దిగా కుంకుమపువ్వుతో కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని ఆరిన తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి కనీసం రెండు మూడు సార్లు చేస్తే మొటిమలు చాలా ఈజీగా తొలగిపోతాయి. అంతే కాదు ముఖంపై మచ్చలు కూడా మాయమయ్యి ముఖం చాలా అందంగా తయారవుతుంది.అలాగే కుంకుమపువ్వు ముడతలు పడిన చర్మం సమస్యకు చికిత్స చేయడంలో కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందుకోసం కుంకుమపువ్వును పాలను గంధంలో కలిపి ఫేస్ ప్యాక్ లా తయారు చేసి ముఖానికి రాసుకోని తరువాత ఆరిన తర్వాత మృదువుగా మసాజ్ చేసి ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ముడతలు పోయి ఖచ్చితంగా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.ఇంకా అలాగే కుంకుమపువ్వును తేనెతో కలిపి అప్లై చేయడం వల్ల పొడి చర్మం కూడా చాలా ఈజీగా నయమవుతుంది.

ఇందుకోసం కుంకుమపువ్వును తేనెతో కలిపి ముఖానికి బాగా పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఇంకా అలాగే కుంకుమపువ్వును పాల క్రీమ్‌తో కలిపి ముఖానికి రాసుకుని బాగా మసాజ్ చేయడం వల్ల కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఇక ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కుంకుమపువ్వుతో మీగడని మిక్స్ చేసి ముఖానికి రాసుకుని బాగా మసాజ్ చేసి నైట్ నిద్రపోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే లేచి ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం మీకు కనిపిస్తుంది.కొబ్బరినూనెలో కుంకుమపువ్వును కలిపి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారడం నుండి ఉపశమనం పొందుతుంది.ఒక చెంచా పాలలో ఒక జంట కుంకుమపువ్వును తీసుకొని రాత్రంతా నానబెట్టండి. తరువాత రోజు అందులో ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి బాగా పట్టించి ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: