జుట్టు రాలడాన్ని చిటికెలో తగ్గించే ఉపాయం?

Purushottham Vinay
చాలా మందికి కూడా తలస్నానం చేసినప్పుడు, జుట్టు దువ్వుకున్నప్పుడు  జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం, మారిన మన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం ఇంకా అలాగే జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి  మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపులను ఇంకా నూనెలను వాడుతూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఈ సమస్య నుండి బయటపడక ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది.ఒక చిన్న టిప్ తో మనం చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.ఇక జుట్టు రాలడాన్ని తగ్గించడంలో గంజి నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో గంజి నీరు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ గంజిలో ఉండే ఇనోసిటాల్ అనే రసాయన సమ్మేళనం జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.


పురాతన రోజుల్లో ఎక్కువగా అన్నాన్ని గంజి వార్చి ఆహారంగా తీసుకొని చాలా ఆరోగ్యంగా వుండే వారు. ఇలా అన్నం వార్చగా వచ్చిన గంజి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఇంకా అలాగే ఈ గంజిని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా పట్టించి ఒక 20 నిమిషాల పాటు బాగా మర్దనా చేయాలి. ఆ తరువాత దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఇక ఒక గంట తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా ఇంకా అలాగే చాలా ధృడంగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ టిప్ ని తరచూ వాడడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు జుట్టు కూడా పట్టులాగా తయారవుతుంది. జుట్టు రాలే సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ఈ టిప్ పాటించడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండా న్యాచురల్ గా జుట్టును ధృడంగా ఇంకా బలంగా మార్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: