చర్మ ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి?

Purushottham Vinay
మన బాడీకి సరిపడినంతగా నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ క్రమంలోనే చర్మాన్ని ఆరోగ్యంగా ఇంకా అలాగే ముడతలు పడకుండా ఉంచే కొల్లాజెన్ వంటి ప్రొటీన్ల ఉత్పత్తి ఈజీగా మందగిస్తుంది. అందుకే మంచి అందమైన చర్మం కోసం ప్రతి రోజూ కూడా ఖచ్చితంగా కంటినిండ సరిపడేంత నిద్ర ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి అందానికి మంచిది.ఇంకా అలాగే ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్‌లో మొటిమలు, రోసేసియా ఇంకా అలెర్జీలకు కారణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులుగా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండే తాజా పండ్లు ఇంకా కూరగాయలు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.అయితే అలా కాకుండా పోషకాలు సరిగ్గా లేని పదార్థాలను తినడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం  ఉందని చర్మ సంబంధిత నిపుణుల అంటున్నారు.అలాగే నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ ఇంకా రిఫ్రెష్‌గా ఉంచుతుంది. అందువల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉండడమే కాక బాగా మెరుస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల ఖచ్చితంగా డీహైడ్రేషన్‌ సమస్యకు దారి తీయవచ్చు.


అందువల్ల చర్మం ఈజీగా పొడిబారుతుంది.మనం చేసే కామన్ తప్పు ఏంటంటే మనకు తెలియకుండానే మన ముఖాన్ని తరచుగా తాకుతుంటాం.ఇలా చేయడం వల్ల మన చేతుల్లో ఉండే సూక్ష్మక్రిములు చర్మంపై దద్దుర్లు ఇంకా అలాగే దురదను కలిగిస్తాయి.అందుకే చర్మాన్ని తాకే ముందుకు చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం లేని చేతులతో ముఖాన్ని తాకవద్దని చర్మ నిపుణులు కూడా చెబుతున్నారు.మార్కెట్లో దొరికే చాలా రకాల కాస్మొటిక్స్ మన చర్మానికి అసలు సరిపడవు. ముఖ్యంగా మేకప్ ఉత్పత్తులు చర్మానికి చికాకు లేదా మొటిమలు పెరగడానికి చాలా ఎక్కువగా దారితీస్తాయి. వివిధ రంగుల ఐషాడోలు ఇంకా అలాగే కాజల్‌లను ఉపయోగించడం వల్ల కళ్ల చుట్టూ మచ్చలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల రోజువారీ మేకప్ వేసుకోవడం అసలు మంచిది కాదని డెర్మటాలజీ నిపుణులు కూడా సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: