ఈ ఒక్క పొడితో అమితమైన సౌందర్యం మీ సొంతం?

Purushottham Vinay
చాలా మంది కూడా నల్లగా ఉండి మొటిమలు మచ్చలు సమస్యలతో బాగా బాధ పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యని ఈజీగా తరిమి కొట్టడంలో దానిమ్మ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ దానిమ్మ గింజలతో పాటు దానిమ్మ తొక్క కూడా  ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దానిమ్మ తొక్కలో ఉండే ఔషధ గుణాలు మనకు చర్మాన్ని, జుట్టును అందంగా ఇంకా ఆరోగ్యంగా మార్చడంలో బాగా ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి  తెలుసుకుందాం. దానిమ్మ తొక్కను సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, స్క్రబర్ గా ఉపయోగించవచ్చు. దానిమ్మ తొక్కలో ఉండే విటమిన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి చాలా మంచిది. చాలా చక్కటి పోషకాలను అందిస్తాయి. తొక్కను ఎండబెట్టి పొడిగా చేసి గాలి నిల్వ కూడా చేసుకోవచ్చు. ఈ దానిమ్మ తొక్కల పొడికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి బాగా పట్టించాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రంగా కడిగి వేయాలి.ఇలా చేయడం వల్ల మొటమలు ఇంకా మచ్చలు ఈజీగా తగ్గుతాయి.


దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి మొటిమలు తగ్గేలా చేస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తాయి. దానిమ్మ తొక్కల పొడిలో కొద్దిగా పాలు కలిపి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి ఆరిన తరువాత కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై ఉండే ముడతలు ఇంకా అలాగే చారలు తొలగిపోయి చర్మం బిగుతుగా తయారవుతుంది.ఈ దానిమ్మ తొక్కల పొడి మంచి సన్ స్క్రీన్ లోషన్ గా పని చేస్తుంది. ఇది ఎండ వల్ల చర్మం నల్లగా మారకుండా కూడా చేస్తుంది. ఇంకా అలాగే  యువీ కిరణాల నుండి చర్మానికి రక్షణ ఇస్తుంది.ఈ దానిమ్మ తొక్కల పొడి మంచి సహజసిద్దమైన స్క్రబర్ గా కూడా పని చేస్తుంది.చర్మంపై ఉండే మృత కణాలను, బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో కూడా దానిమ్మ తొక్కల పొడి సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఇంకా చుండ్రును నివారంచడంలో, జుట్టును ధృడంగా ఆరోగ్యవంతంగా చేయడంలో కూడా దానిమ్మ తొక్కల పొడి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: