బాదం: ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచిది?

Purushottham Vinay
బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ బాదం పప్పును తీసుకోవడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. మన శరీరంలో జీవక్రియ రేటు పెరిగి అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. నానబెట్టిన బాదం పప్పులు సులభంగా జీర్ణం అవుతాయి. తద్వారా వాటిలో ఉండే పోషకాలన్ని శరీరానికి అందుతాయి. బాదంపప్పులను నానబెట్టి తీసుకోవడం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది.ప్రతిరోజూ కూడా బాదం పప్పును తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చర్మాన్ని నిగనిగలాడేలా చేసే శక్తి కూడా బాదం పప్పుకు ఉంది. బాదం పప్పుతో ఫేస్ ఫ్యాక్ ను వేసుకోవడం వల్ల చర్మానికి కావల్సిన పోషకాలు అంది చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. ఎటువంటి చర్మతత్వం ఉన్న వారికైనా బాదం ఫేస్ ప్యాక్ లు ఎంతో సహాయపడతాయి. ఈ ఫేస్ ఫ్యాక్ ను తయారును చేసుకోవడానికి గానూ మనం బాదం పప్పుల పేస్ట్, పాలు, ఓట్స్ మీల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.


ముందుగా ఒక గిన్నెలో పాలను తీసుకోవాలి. తరువాత రాత్రంతా నానబెట్టిన బాదంపప్పులను పేస్ట్ గా చేసి వేసుకోవాలి. తరువాత పాలలో నానబెట్టిన ఓట్స్ ను పేస్ట్ గా చేసి వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ లా వేసుకోవాలి.అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే నానబెట్టిన బాదం పప్పులను పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ లో పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గి ముఖం అందంగా తయారవుతుంది. ఈ విధంగా బాదం పప్పు మన ఆరోగ్యానికి, మన సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, నానబెట్టిన బాదం పప్పును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: