ఈ టిప్స్ పాటిస్తే బ్యూటీ పార్లర్ కి వెళ్లనవసరం లేదు?

Purushottham Vinay
అందంగా మారాలంటే బ్యూటీ పార్లర్ కే వెళ్లనవసరం లేదు. ఇంట్లో వుండే కొన్ని కొన్ని టిప్స్ తో చాలా ఈజీగా అందంగా మారిపోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ అల్లం తురుము, ఒక టీ స్పూన్ పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమం సహజ సిద్ద స్క్రబర్ గా పని చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం ఉండే మృతకణాలు తొలగిపోతాయి. బేకింగ్ సోడాను ఉపయోగించి కూడా మనం ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఒక గిన్నెలో బేకింగ్ సోడాను, కొద్దిగా ఆలివ్ నూనెను వేసి పేస్ట్ గా కలుపుకోవాలి.తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటూ స్క్రబ్ చేస్తూ మర్దనా చేస్తూ శుభ్రపరుచుకోవాలి. ఇలా ముఖాన్ని శుభ్రపరిచిన వెంటనే మనం ముఖం మృదువుగా మారడాన్ని, ముఖంలో మార్పు రావడాన్ని గమనించవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా మొటిమలను మనం తగ్గించుకోవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో తులసి ఆకులు వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.


ఈ తులసి ఆకుల నీటిని టోనర్ గా వాడడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అదేవిధంగా రోజ్ వాటర్ మన ముఖానికి మంచి టోనర్ గా పని చేస్తుంది. దీనిలో విటమిన్స్, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ఒక గిన్నెలో రోజ్ వాటర్ ను తీసుకుని దానిలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం  రంగు పెరుగుతుంది. మనం ఆహారంగా తీసుకునే కర్జూరాలను ఉపయోగించి కూడా మనం మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒక గిన్నెలో పాలు, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ కర్జూరం పేస్ట్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫ్యాక్ ల వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ టిప్ పాటించడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. చర్మం పై ఉండే ముడతలు, సన్నని చారలు కూడా తొలగిపోతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ ఖర్చులో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: