డెలివరీ అయ్యాక బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే టిప్?

Purushottham Vinay
ఇక డెలివరీ అయ్యాక చాలా మందిలో పొట్ట ఇంకా నడుము భాగంలో కొవ్వు పెరిగిపోయి చాలా లావుగా తయారవుతుంటారు. దాంతో కొందరు అసహ్యంగా భావించి నలుగురిలో కలవాలన్నా ఇంకా బయటకు వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటారు.పెరిగిన పొట్టను తగ్గించుకోవటానికి చాలా ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సరైన ఫలితం ఉండదు. చాలా మంది కూడా పొట్ట తగ్గటానికి విపరీతంగా డైటింగ్ చేసేస్తూ ఉంటారు. కానీ పొట్ట తగ్గకుండా నీరసం ఇంకా నిస్సత్తువ రావటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల బారినపడుతుంటారు. ఇక అలాంటి వారికోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవటానికి ఇలాంటి సులభమైన చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది..ఇక అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.మన వంటింట్లోనే లభించే కొన్ని రకాల మసాల దినుసులతో బెల్లి ఫ్యాట్‌కు చాలా ఈజీగా చెక్‌ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే యాలకులు ఇంకా సోంపుతో కలిసి చేసే కషాయం కూడా డెలీవరి తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు సహపడుతుందని చెబుతున్నారు.


ఇక ఇందుకోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు వెంటనే కరుగుతుంది. పైగా తల్లిపాలను పెంచటంలోనూ ఈ కషాయం బాగా తొడ్పడుతుంది.ఈ నీటిని తాగిన ఒక 10 నిమిషాల తర్వాత పొట్ట మీద నువ్వుల నూనె రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కాపడం పెట్టుకోవాలని చెబుతున్నారు. దాంతో పొట్ట మీద కండరాలు చాలా టైట్ గా మారతాయి. ఇలా చేయటం వలన డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెస్ మార్క్స్ కూడా ఈజీగా తొలగిపోతాయి.తర్వాత పొట్టకు సంబందించిన వ్యాయామాలు చేసి అనంతరం స్నానం కూడా చేయాలి. ఇక ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులపాటు చేస్తూ ఉంటే..మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నడుం చుట్టు సన్నబడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: