"ఐ లైనర్" వాడుతున్నారా... ఇవి తెలుసుకోండి?

VAMSI
అమ్మాయిలకు అందం అనేది చాలా ప్రత్యేకం. అందంగా కనిపించాలని ప్రతి ఒక అమ్మాయి అనుకుంటుంది ఇక మేకప్ అనేది వారి అందానికి అడిషనల్ టచప్. ముఖ్యంగా సినిమాలలో, సీరియల్స్ లో ఇలా రకరకాల గా స్క్రీన్పై కనిపించే వారు తమ అందం అధ్బుతంగా కనిపించడానికి మేకప్ వేసుకుంటారు. అలాగే స్పెషల్ అకేషన్స్ లోనూ చాలామంది అమ్మాయిలు మేకప్ వేసుకోవడం పరిపాటిగా మారింది. లిప్స్టిక్, ఐ లైనర్, కలర్ కలర్ క్రీమ్స్ ఇలా పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయితే ఇప్పుడు మనం ఐలైనర్ గురించి మాట్లాడుకుందాం.
ఐ లైనర్ అనేది మేకప్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.  ఐలైనర్‌ అనేది కాస్త ఎక్కువైనా లేదా అటూ ఇటూ అయినా ఇక అంత సేపు చేసిన మేకప్‌ మొత్తం పాడైపోతుంది. అయితే ఐలైనర్‌ లైన్‌ దాటి పక్కకు పోకుండా ఎలా చేసుకోవాలి. ఐలైనర్ ను  ఎలా పెట్టుకుంటే మీ కళ్ళకు మరింత అందం పెరిగి మీ ముఖం మరింత అద్భుతంగా కనిపిస్తుంది అన్నది తెలుసుకుందాం. ఇప్పట్లో ఫ్యాషన్ కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మేకప్ కిట్స్, జువెలరీ కలెక్షన్ ఇలా అందానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ పలు రకాల బ్రాండ్ లలో, ప్రైజ్ లలో దొరుకుతున్నాయి. అదే విధంగా ఐలైనర్‌ లు కూడా మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు లభిస్తున్నాయి. అయితే కంటికి నచ్చింది కదా అని ఏది పడితే అది కొనకూడదు. ఎందుకంటే కన్ను చాలా సున్నితమైన భాగం అలాగే ఐ లైనర్ కంటికి వేసుకోవాల్సిందే కాబట్టి.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

మంచి బ్రాండ్ ఉన్న ఐ లైనర్ ను వినియోగించడం ద్వారా పెద్దగా సమస్య ఉండదు. అలాగే ఇది మన కళ్ళకు ఎంతవరకు నప్పుతుందో చెక్ చేసుకోవాలి. లేదంటే మరొక ఐ లైనర్ ను ఎంచుకోవాలి. ఏదైతే మనకు కరెక్ట్ గా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ ఐ లైనర్ ను కంటిన్యూ చేయడం మంచిది. అలాగే ఐ లైనర్ అనేది వాటర్ ప్రూఫ్ ఆ కాదా అన్నది చూడాలి. అంతే కాకుండా వాటర్ప్రూఫ్ అయితే కళ్లపై అయినది ఎక్కువ సేపు అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగే హాని కూడా కలిగించదు. ఐలైనర్‌ కనులకు వేసుకొనే ముందు కనురెప్పలకు ప్రైమర్‌ వేయడం మంచిది. మొదట ప్రైమర్‌ అప్లై చేశాకే  ఐలైనర్‌ వేసుకోవాలి. ప్రైమర్‌ ను మొదట వేసుకోవడం వలన ఐలైనర్‌ ఎక్కువ సమయం వరకు అంతే బ్రైట్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ కళ్ళు మరింత కాంతిగా అందంగా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది.
మేకప్‌ వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు అవసరం. కంటి కింది భాగంలో కన్‌సీలర్‌ ను పూసుకోవడం వలన కంటి కింద ఉండే మచ్చలు, డార్క్ నెస్ తగ్గుతాయి.  అంతేకాకుండా  కళ్లు పెద్దవిగా విచ్చుకున్నట్లు అందంగా కనిపిస్తాయి.
అలాగే ఐలైనర్‌ కంటికి వేసుకునే ముందు కన్‌సీలర్‌ ను  రాసుకోవడం ఉత్తమం. కాళ్ళకి కాజల్ లేదా జెల్‌ ఐలైనర్‌ వాడుతున్నారు అంటే  మీ కళ్లకు ఖచ్చితంగా సూట్ అయ్యే  ఐషాడో వేసుకోవాలి. అప్పుడే మీ కళ్ళు మరింత అందంగా మెరిసిపోతాయి. దీనివల్ల మీ కళ్ళకి అందం డబుల్ అవుతుంది. ఒకవేళ మీ కళ్ళు మరింత పెద్దవిగా...స్పెషల్ గా కనిపించాలి అనుకుంటే మీ కాళ్ళకి ఐలైనర్‌ను రెండు సార్లు  కోటింగ్‌ ఇస్తే సరిపోతుంది. దానివల్ల మీ కనులు మరింత బ్రైట్‌గా అందంగా కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: