ఈ రెమిడీస్ తో హెయిర్ ఫాల్ దూరం..

Purushottham Vinay
ఇక జట్టు రాలే సమస్య ఈరోజుల్లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని బాగా వేధిస్తుంది. అయితే ఈ సమస్యకు ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంలోని యాంటి బాక్టీరియల్‌ గుణాలు తలలోని బాక్టీరియా ఇంకా ఇన్ఫెక్షన్లను బాగా తగ్గిస్తుంది. అందుకే ఉల్లిపాయను ముక్కలుగా కోసి వాటిని నుంచి వచ్చే రసాన్ని దూదితో మీ జుట్టుపై బాగా అప్లై చేయండి.ఇక ఇలా 30-50 నిమిషాల పాటు ఉంచుకోవాలి.అలాగే మీ జుట్టును నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం మీ జుట్టు ఇక పలుచబడకుండా ఉంటుంది. ఇక ఇది జుట్టు కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది.మందార ఆకులు, మందార పువ్వులు కూడా హెయిర్ ఫాల్ సమస్యని తగ్గిస్తాయి.

ఇక మందార ఆకులు అలాగే పూలను బాగా గ్రైండ్ చేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఇక ఈ మిశ్రమంలో పెరుగు వేసి దాన్ని బాగా కలపాలి.ఆ మిశ్రమాన్ని మీ మాడుకు ఇంకా జుట్టుకు అప్లై చేసి ఒక గంట సేపు పాటు ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో బాగా శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ చిట్కాను పాటించటం వల్ల మంచి చక్కటి ఫలితం అనేది ఉంటుంది.అలాగే తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు బాగా రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈ విధంగా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి కుదుళ్లు అనేవి బాగా గట్టిపడతాయి.అలాగే గోరింటాకు చేతికి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో జుట్టుకు పెట్టుకున్నా కూడా శిరోజాలకు అంత ఆరోగ్యం కూడా. గోరింటాకును బాగా నూరి దాన్ని తలకు బాగా అద్దుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే కూడా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: