ఇలా చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గడం ఖాయం...

Purushottham Vinay
ఇక అందంగా కనపడాలంటే మంచి కలర్ బాడీ మాత్రమే ఉంటే సరిపోదు. ఆ బాడీకి తగ్గట్టు ఇంకా అలాగే కలర్ కి తగ్గట్టు మంచి హెయిర్ స్టైల్ కూడా ఉండాలి. ఇక ఈ రోజుల్లో చాలా మందికి చాలా చిన్న వయస్సు నుంచే హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టీనేజ్ నుంచే హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక 25 సంవత్సరాలు వచ్చే సరికి సగం జుట్టు ఊడిపోయి బట్టతల అవుతుంది.కొంతమందికి బట్టతల వల్ల పెళ్లిళ్లు కూడా సరిగ్గా అవ్వట్లేదు.ఇది చిన్న సమస్య కాదు. ప్రస్తుత కాలంలో యూత్ ఎక్కువగా ఎదురుకుంటున్న సమస్య. ఇక ఈ సమస్యకి చిట్కాలు ఏంటో తెలుసుకోండి. ఖచ్చితంగా పాటించండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.ఈ రోజుల్లో చాలా మంది కూడా ఆఫీసుల్లో ఎక్కువ టైం పని చేసి చాలా ఒత్తిడికి లోనవుతుంటారు.ఒత్తిడికి లోనవ్వడం వల్ల జుట్టు రాలిపోతుంది. ఇక ఒత్తిడి వల్ల జుట్టు రాలకుండా ఉండటానికి నువ్వుల నూనె బాగా సహాయపడుతుంది.
నువ్వుల నూనెలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అందుకే నువ్వులనూనెను తలకు బాగా పాటించాలి. అలా తలకు బాగా పట్టించడం వలన తలలో వేడి తగ్గిపోయి మీ మైండ్ అంత చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇంకా ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. ఇక నువ్వుల నూనె తలకు బాగా పట్టించిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోయే సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది.ఇక అలాగే మందార పువ్వులు కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోతుంది.మందార పువ్వులను తీసుకొని వాటిని కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెలో వేసి కొంచెం సేపు కాచి ఆ నూనెను వెంట్రుకలకు బాగా పట్టించాలి. అలా పట్టించిన ఒక గంట తర్వాత కుంకుడు కాయ రసంతో స్నానం చెయ్యాలి. అలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది.అలాగే మందార ఆకులను బాగా మెత్తగా నూరి వాటిని తలకు బాగా పట్టించి కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: