ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి..?

Divya

మహిళల్లో ముఖ్యంగా అందంగా కనిపించాలంటే  ఉండవలసినవి 'ఐబ్రోస్'. అలాంటి ఐబ్రోస్ పర్ఫెక్ట్ గా లేకపోతే ఎంత అందం గా రెడీ అయినా కూడా డిఫరెన్స్ కనపడుతుంది. అందుకే ఐబ్రోస్.. పేస్ ని డిఫైన్ చేస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే ఒకప్పుడు అది పలుచని కనుబొమ్మలు ఫ్యాషన్ అయితే, మరొకప్పుడు బోల్డ్ ఐబ్రోస్ ఫ్యాషన్. ఇలా స్టైల్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు థిక్ ఐబ్రోస్ ఉండడం ఫ్యాషన్ గా మారింది.
దీంతో ఇప్పుడు అందరూ నీటుగా మంచి షేపులో ఉండే ఐబ్రోస్ కోసం ట్రై చేస్తున్నారు.ఒక వ్యక్తి ముఖం చూసి చూడగానే ముందు కనపడేవి వారు కనుబొమ్మలు అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఐబ్రోస్ ఎంత తక్కువగా ఉంటే కళ్ళు అంత హైలెట్ గా కనిపిస్తాయి. కొంతమంది సహజంగానే థిక్ ఐబ్రోస్ తో పుడతారు. మరి కొంతమందికి పల్చని ఐబ్రోస్ ఉంటాయి. అలాంటి వారికి కొన్ని హోం రెమడీస్ ద్వారా మీ పల్చని  ఐబ్రోస్ ని థిక్ ఐబ్రోస్ గా మార్చుకోవచ్చు.

1) ఆలివ్ ఆయిల్:  ఆలివ్ ఆయిల్స్ లో విటమిన్ ఏ,సి ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. కనుబొమ్మల పైన ఆలివ్ ఆయిల్ ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల,  కొన్ని వారాల తర్వాత ఆశించిన ఫలితం కనబడుతుంది. మీ చేతి వేళ్ళ మీద ఒక చుక్క ఆలివ్ ఆయిల్ వేసుకొని,  ఐబ్రోస్ మీద మసాజ్ చేయండి. రెండు గంటలు అలాగే వదిలేసి, ఆ తర్వాత ఫేస్ వాష్ చేసి ముఖం కడుక్కోండి.
2). ఆముదం: ఇది చాలా పాత పద్ధతి.  ఇది చాలామందికి తెలిసిన పద్ధతి. ఇది బాగా ఎఫెక్టివ్ గా పనిచేసే పద్ధతి కూడా. ఆముదంలో ప్రోటీన్స్,యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండడం వల్ల హెయిర్ గ్రోథింగ్ పెరుగుతుంది.మీరు కనుబొమ్మల మీద ప్రతిరోజు ఆముదం అప్లై చేయడం ద్వారా మీ ఐబ్రోస్ ఒత్తుగా, స్ట్రాంగ్ గా పెరుగుతాయి.
3) కొబ్బరి నూనె: కొబ్బరి నూనె ను అప్లై చేయడం వల్ల ఇది ఒక కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. ఇందువల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ లో ఉండే నాచురాలిటీ ప్రోటీన్స్ తో కలిసి వర్క్ చేస్తాయి. అంతేకాకుండా కొబ్బరి నూనెలో విటమిన్ ఈ,  ఐరన్ వంటి రకాల ప్రోటీన్స్ ఉండడంవల్ల ఐబ్రోస్ చాలా మందంగా వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: