వీటిని తింటే కొద్ది రోజుల్లో జుట్టు పెరుగుదలను గమనించవచ్చు..!

Divya

జుట్టు అందంగా ఉండాలని, ఒత్తుగా ఉండాలని, ఎక్కువ పొడవు కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే మన శరీరంలో ఎక్కువ పోషకాలు కూడా ఉండాలి. ఎప్పుడైతే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటామో, అప్పుడు జుట్టు కూడా అంతే పొడవుగా పెరుగుతుంది అని అంటున్నారు నిపుణులు. అయితే జుట్టు పొడవుగా పెరగాలి అంటే ఏం తినాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

చేపలు :
చేపలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయని మనందరికీ తెలుసు. చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి చేపలు అలవాటు లేని వాళ్ళు కూడా చేపలను ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి.  చేపలను తినడం వల్ల జుట్టు పొడవుగా పెరగడమే కాకుండా కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.  జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. కుదిరితే వారానికి మూడు సార్లు చేపలను తినడం వల్ల జుట్టు పెరగడానికి ఎవరు ఆపలేరు..

ఎండిన పండ్లు:
ఎండిన పండ్లలో కూడా అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఇలాంటి వాటిపై మనం శ్రద్ధ వహిస్తే, జుట్టు పెరగడానికి ఎవరూ ఆపలేరు. వీటిలో ప్రోటీన్, జింక్ ఉంటుంది. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. వాల్నట్ అలాగే బాదంపప్పు లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ జుట్టు పెరుగుదల మెరుగుపడాలంటే ఎండిన పండ్లను ఒక భాగంలో చేసుకోవాలి.

అవకాడో :
అవకాడో ని బట్టర్ ఫ్రూట్ లేదా వెన్న పండు అని కూడా అంటారు. అవకాడో విటమిన్ ఇ అలాగే మంచి కొవ్వులు ఉంటాయి. అంతే కాకుండా ఈ అవకాడో తినడం వల్ల జుట్టు విరిగిపోకుండా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.
చిలకడ దుంపలు:
చిలకడ దుంపలు ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. జుట్టు పెరుగుదలను అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చిలగడదుంపలు ఎంతగానో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: