శీతాకాలంలో ఆరోగ్యంతో పాటు అందం

Durga
శీతాకాలంలో బాగా నిద్రపట్టేస్తే, ఉదయం లేస్తూ చిరాకు, పరాకులు వుండవు. అలపట అసలే వుండదు. మంచి నిద్ర మెదడుకే కాదు శరీరానికి మేలు చేస్తుంది. ముఖం తాజాగా చక్కని కాంతితో మెరవడానికి నిద్ర కూడా కారణమే, నిద్రలేని రాత్రులు ఎక్కువయితే వయసు మీదపడిన ఛాయలు ముఖంలో కదలాడతాయి. ఓ వారం రోజుల పాటు రోజుకు నిద్రను నాలుగు గంటలకే పరిమితం చేస్తున్న వారిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో విడుదల అయ్యే కార్టాసాల్ హార్మోన్లస్థాయి, గ్లూకోజ్ స్థాయి, హార్ట్రేట్ అధికంగా వుంటాయి. ఫలితంగా బ్లడ్ ప్రెషర్, ఒబేసిటీ డయాబెటీస్ వంటి సమస్యలూ చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఆరోగ్యంతోపాటు అందం కూడా కావాలంటే రాత్రివేళలు ప్రశాంతంగా, హాయిగా నిద్రపోండి. సరిగ్గా నిద్రపట్టకపోతే ఈ కింది సూచనలు పాటించడం శ్రేయస్కరం. 1.మధ్యాహ్నాంవేళ ఓ కునుకు తీసేయండి. బాగా విశ్రాంతి నిచ్చే కునుకు పది నుంచి ఇరవైనిమిషాలు కావచ్చు లేదా గంట నుంచి రెండు గంటలు కావచ్చు. అయితే పగటినిద్ర ఎక్కువైతే రాత్రి నిద్రకు చెరుపన్న సంగతి మరవద్దు. 2. భాగస్వామి గురక లేదా తరచూ కదలడం మూలంగా నిద్రాభంగం అవుతున్నట్లయితే, ఒంటరిగా పడుకోండి. 3. కొన్ని రకాల మందులు వాడకం నిద్రను దూరం చేస్తుంది. అటువంటి వాటిని గమనించండి. 4.నిద్రలేమి ఎక్కువగా ఉన్నపుడు అది దీర్ఘకాలిక సమస్యగా మారకుండా వుండేందుకు నిద్రమాత్రల వాడకం తప్పదు. అయితే ఇష్టం వచ్చినట్లు వాటిన ఉపయోగించకుండా వైద్యుల సలహా మేరకకు తగు మాత్రం వాడితే ఆరంభలోనే సమస్య తగ్గిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: