ముఖం మీద ఏర్పడిన డెడ్ స్కిన్ సెల్స్ ను ఎలా తొలగించాలో తెలుసా...!

Divya

ప్రతి ఒక్కరూ ముఖం అందంగా, నిగనిగలాడుతూ, తాజాగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఏవీ మనం కోరుకున్న అందాన్ని ఇవ్వలేవు అనేది  అవాస్తవం.. మనం పాటించే ఏ చిక్క అయినా సరే కొంతమేర ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అయితే పూర్తిగా మనం వాడే ప్రతి చిట్కా ఫలితాన్ని ఇవ్వాలంటే మాత్రం కొన్ని పద్ధతులను కంపల్సరిగా వాడాలి అంటున్నారు నిపుణులు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో మనం వాడే క్రీములు, పౌడర్లు లలో ముఖ్యంగా రసాయనాలు అధికంగా ఉండడం వల్ల, ఇవి ముఖ చర్మం మొత్తాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా ముఖ సౌందర్యం చెడిపోతుంది. అందుకు బొప్పాయి,చక్కెర ఫేస్ ప్యాక్ మంచిది అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక కప్పు బొప్పాయి ముక్కలు తీసుకుని, బాగా మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల చక్కెర కలిపి,ముఖానికి అప్లై చేసి, సుతిమెత్తగా మర్దనా చేయాలి. పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి,ముఖం తాజాగా ప్రకాశవంతంగా మెరుస్తుంది.

అంతేకాకుండా కాఫీ పొడి  ఫేస్ ప్యాక్ కూడా ముఖం మీద ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ఇందుకోసం కాఫీపొడిలో ముందుగా తేనె కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా పూయాలి.  అర గంట ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.  ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.చర్మం తాజాగా ఉంటుంది.

అలాగే స్ట్రాబెర్రీలు కూడా ముఖాన్ని అందంగా మారుస్తాయి. ఇందుకోసం స్ట్రాబెర్రీ మొక్కలను మెత్తగా నూరి, అందులో కొద్దిగా తేనె,నిమ్మరసం కలిపి,ముఖానికి పట్టించి,20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.  ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.  ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: