ఆ చిట్కాలు పాటించడం వల్లే నేను ఈ రోజు ఇంత అందంగా వున్నాను : మౌని రాయ్

Divya

అందం అంటే అమ్మాయి.. అమ్మాయి అంటే అందం..  నాటి నుంచి నేటి వరకు ప్రతి అమ్మాయి కోరుకునేది ఎదుటివారికి అందంగా కనిపించాలని,నలుగురిలో ప్రశంశలు పొందాలని,అందరూ తన అందాన్ని పొగడాలి అని. ఇంటి నుండి బయటకు అడుగుపెట్టాలంటే చాలు కొంచెం కొత్తగా, స్టైల్ గా కనిపించాలని ఆశ పడుతూ ఉంటారు. ఇందుకోసం అమ్మాయిలు తమ ముఖాలను అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఆశ పడుతుంటారు. ఇక చలికాలంలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చలికాలంలో ఎక్కువగా చర్మం పొడిబారుతుంది. దీనికంటూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కొంతమంది అమ్మమ్మ చిట్కాలు పాటిస్తే, మరికొందరు సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాషన్ వరల్డ్ లో వచ్చే కొత్త కొత్త ఫ్యాషన్లను ఫాలో అవుతూ, తమకు నచ్చిన విధంగా రెడీ అవుతూ ఉంటారు. సాధారణంగా స్టైల్, ఫ్యాషన్ అనగానే చాలామంది మహిళలు బాలీవుడ్ అందాల భామల పై మక్కువ చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్, నాగిని ఫేమ్ యాక్ట్రెస్ "మౌని రాయ్".తను చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా అందంగా ఉండవచ్చని సూచిస్తోంది. అవి ఏంటో, ఆమె ఎలాంటి చిట్కాలు పాటిస్తోందో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ముద్దుగుమ్మ ముఖానికి పర్ఫెక్ట్ లుక్ లో రావడానికి సరైన కాంటోరింగ్ చేస్తుందట. దీనివల్ల బుగ్గలు అందంగా, ఎర్రగా మెరుస్తూ ఉంటాయి.
బ్రౌన్ స్మోకీ ఐ మేకప్ కళ్ళకు వేయడం వల్ల పాశ్చాత్య రూపంలోనైనా,  సాంప్రదాయ రూపంలోనైనా చాలా చక్కగా అందంగా కనిపిస్తారు. ఈ మేకప్ వేసేటప్పుడు బ్లాక్ కలర్ లేదా బ్రౌన్ కలర్ ఐషాడో తో  స్మోకీ మేకప్ వేసుకోవచ్చు.
రెడ్ కలర్ లిప్ స్టిక్ ఏ అమ్మాయి వేసుకున్నా, తన అందాన్ని రెట్టింపు చేస్తుంది.  ఈ రెడ్ కలర్ లిప్ స్టిక్ తో పాటు లిప్ లైనర్ వేసుకోవడం వల్ల అమ్మాయి సౌందర్యవంతంగా కనిపిస్తుంది.
మేకప్ వేసుకునే ముందు ఖచ్చితంగా కొన్ని మేకప్ ఫౌండేషన్ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ముందుగా ముఖం మీద బ్లషర్ ఉపయోగించాలి. దీని తర్వాత ఫైనల్ లుక్ కోసం హైలైటర్ ను వాడితే సరిపోతుంది.

ఇంకెందుకు ఆలస్యం అమ్మాయిలు ఎలాగో క్రొత్త సంవత్సరం వచ్చేసింది .  ఈ 2021 లో కొత్తగా రెడీ అవడానికి  మౌనీ రాయ్ చెప్పిన చిట్కాలను మీరు  కూడా ట్రై చేసి చూడండి. అందరిచేత వావ్ అనిపించండి. ఈ చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే పర్ఫెక్ట్ అందం మీ సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: