ఈ కిచెన్ బ్యూటీ టిప్స్ తో మిలమిలా మెరిసిపోండి

Naga Sai Ramya
అందంగా కనిపించాలంటే ఖరీదైన కాస్మెటిక్స్ నే వాడాల్సిన పనిలేదు. వంటింట్లో లభించే పదార్థాలతో కూడా అందంగా కనిపించవచ్చు. మీ డైలీ బ్యూటీ రొటీన్ లో ఈ పదార్థాలకు స్థానమివ్వండి. అందంగా మెరిసిపోండి. మరి వంటింట్లోని బ్యూటీ ఇంగ్రీడియెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా...?
1. నెయ్యి:
వింటర్ సీజన్ లో పగిలిన పెదవుల సమస్య అనేది కామన్ అన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను వంటింట్లో లభించే నెయ్యితో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కాస్తంత నెయ్యిని చేతిలోకి తీసుకుని పెదాలపై అప్లై చేయండి. ఇలా చేస్తే పెదాలు మృదువుగా మారిపోతాయి.
2. పసుపు:
మార్కెట్ లో లభించే అనేక కాస్మటిక్స్ లో పసుపును ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ గా వాడతారు. పసుపుతో మొటిమల సమస్యను నివారించవచ్చు. అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ను తగ్గిస్తుందిది. డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే, ముడతలను నివారిస్తుంది.
3. తేనె:
తేనెలో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది డ్రై స్కిన్ ను హైడ్రేట్ చేస్తుంది. మొటిమలను కలిగించే బాక్టీరియాపై పోరాడుతుంది. యాంటీ ఏజింగ్ ఇంగ్రిడియెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి, తేనెని వంటింట్లో అందుబాటులో ఉండే  ఓ గొప్ప బ్యూటీ ఇంగ్రిడియెంట్ గా చెప్పుకోవచ్చు.  
4. కొబ్బరి నూనె:
కిచెన్ లో లభించే ఈ పదార్థాన్ని మేకప్ రిమూవర్ గా పేర్కొనవచ్చు. అలాగే, ఇది గొప్ప ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. స్కిన్ ను హైడ్రేట్ చేస్తుంది. డ్రై ప్యాచెస్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది.
5. నిమ్మకాయ:
నిమ్మకాయతో అనేక బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చు. స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.
6. అల్లం:
హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. నేచురల్ క్లీన్సర్ లా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి.
7. శనగపిండి:
ఇది అత్యద్భుతమైన ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ట్యాన్ ను తొలగించి స్కిన్ ను లైటెన్ చేస్తుంది. మొటిమల నుంచి రిలీఫ్ ను అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: