ట్యాన్ పోగొట్టుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చెయ్యండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చాలా మందికి ఎండలో తిరిగి ముఖం ట్యాన్ అయిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ లని ట్రై చెయ్యండి. ట్యాన్ పోతుంది..స్ట్రాబెర్రీ, మిల్క్ క్రీంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ట్యాన్‌ను చాలా సులభంగా పోగొడుతుంది. అంతేకాదు డార్క్ స్పాట్స్ ని సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది.కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని స్పూన్ సాయంతో లేదా బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ చర్మానికి చాలా మంచివి. ఇవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మృతకణాలను తొలిగించి చర్మాన్ని అందంగా మారుస్తాయి.
తేనెలోని గుణాలు చర్మానికి పోషణనిస్తాయి.బాగా ముగ్గిన బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలుంటాయి. ఇవి ట్యాన్‌ను పోగొట్టి చర్మాన్నిమెరిపిస్తాయి. దీనికి రోజ్ వాటర్, కీర దోస రసం కూడా కలిపితే.. ఎండలో వదిలిపోయినట్లుగా తయారైన చర్మానికి తిరిగి జీవకళ అందుతుంది. ఈ మిశ్రమం చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్‌ను సైతం తగ్గిస్తుంది.టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, కీర దోస రసం, రోజ్ వాటర్ తీసుకోవాలి. ఈ మూడింటిని గిన్నెలో వేసి బాగా కలపాలి. 
ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసుకోవాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.ట్యాన్ పోగొట్టుకోవడంతో పాటు చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవడానికి టమాటా, ఎర్రకందిపప్పు, కలబందతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు తీసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. నానిన కందిపప్పులో చెంచా టమాటా గుజ్జు, కొద్దిగా కలబంద గుజ్జు కూడా కలిపి బ్లెండర్లో వేసి మెత్తటి గుజ్జుగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంపై ఉన్న ట్యాన్ పోతుంది.నిమ్మరసంలో ఉన్న ఆస్కోర్బిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృత‌ కణాలను, ట్యాన్‌ను తొలిగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
 ఈ ఫలితాన్ని పొందడానికి మనమేం చేయాలంటే.. బాగా ముగ్గిన నిమ్మకాయ ముక్క తీసుకొని దానిలోని గింజలను తీసేయాలి. దీంతో ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరింత ఎక్కువ సమయం రుద్దుకోవాలి. రుద్దడం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాలు అలా వదిలేయాలి.ఆపై నూనెతో ముఖాన్ని రెండు నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకొంటున్నప్పుడు చర్మంపై పేరుకొన్న మురికి, మృత‌ కణాలు, మట్టి వదిలిపోతాయి. ఆ తర్వాత చర్మం పూర్తిగా శుభ్రం కావడంతో.. అది అందంగా మెరిసిపోతుంది. ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: