ఈ చిట్కాలు పాటిస్తే మీకంటే అందంగా ఎవరు ఉండరు!

kalpana
 ఏ చిట్కాలు పాటించిన మన చర్మం నున్నగా,తెల్లగా ఉండాలి అనుకుంటాం.వున్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు మెరుగుపడాలంటే అనుకుంటాం ఇవన్నీ చేయడానికి బ్యూటీ పార్లర్ వెళ్ళే సమయం లేనప్పుడు ఈ చిట్కాలు పాటించండి.
 చర్మం నిగనిగలాడాలంటే కొన్ని పుదీనా ఆకులు తీసుకుని కొత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ను చర్మానికి పోయాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి.
 టమాటా రసం తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం కలిపి చర్మానికి బాగా అప్లై చేయాలి.పదహైదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.ఇలా రోజు ఉదయం, సాయంత్రం 20 రోజులపాటు చేయండి. చర్మము మెరుస్తూ ఉంటుంది.
 నిమ్మరసం, పచ్చి బంగాళాదుంప రసం కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మం నిగనిగలాడుతుంది.
 రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, నాలుగు టీస్పూన్లు నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి.అరగంట ఆరిన తర్వాత తల స్నానం చేయాలి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా,  మెరుస్తూ ఉంటుంది.
 మెడ, మోచేతులు నల్లగా ఉన్న వాటర్ ని తెల్లగా మార్చడానికి ఒక టేబుల్ స్పూన్ పెసరపిండి,రెండు టేబుల్ స్పూన్ల పాలు, రెండు చుక్కల నిమ్మరసం కలిపి మెడ మీద, మోచేతి పైన పట్టించే పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.
 ఎండ వల్ల కందిపోయిన ముఖానికి, మెడకి మూడు టేబుల్ స్పూన్ల దోస రసం,రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్,ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించే 15 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం, మెడ నిగారింపుగా ఉంటాయి.
 ముఖం మీద ఉన్న జిడ్డు తొలగించడానికి టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్ల సొన కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
 వేపాకు పొడి కొంచెం పసుపు తగినన్ని రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసుకొని,ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: