ఆ చిట్కాలు పాటించి ముఖం మీద మొటిమలు తగ్గించుకోవచ్చా?

Divya

యుక్త వయస్సులో ఉండే యువతీ యువకులను పీడించే చర్మ సమస్య మొటిమలు.మొటిమలు ముఖ చర్మాన్ని విహీనం చేస్తాయి. అంతేకాకుండా పొడిబారేలా చేస్తాయి. మొటిమలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాలైన కాస్మెటిక్స్, క్రీమ్స్ ను వాడుతుంటారు. ఎంత ఖరీదైన లెక్క చేయకుండా కొనేస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి, అబ్బాయి అందరికంటే అందంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.
కేవలం వంటింటి చిట్కాలను మాత్రమే వాడి మొటిమలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.  అయితే ఆ చిట్కాలేంటో వాటిని వాడి మొటిమలను  ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు ఇక్కడ  చదివి  తెలుసుకుందాం.
మునగాకులో ముఖ్యంగా ఐరన్, ఫాస్ఫరస్,విటమిన్ ఎ,విటమిన్ సి,  మెగ్నీషియం వంటి ఎన్నో  పోషకాలున్నాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చర్మం మీద మొటిమలను  కూడా తగ్గించుకోవచ్చని ఒక  అధ్యయనం ద్వారా తెలిసింది. అందుకోసం ఏం చేయాలంటే మునగాకు నుంచి రసాన్ని తీసి, అందులో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి,మెడకు పట్టించి మర్దనా చేయాలి. 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేస్తే మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా మెడ మీద ఉండే నల్లటి చర్మాన్ని కూడా సహజ రంగుకు తీసుకురావచ్చు.
గళ్ళఉప్పు అందరికీ తెలిసిందే. దీనిని సీ సాల్ట్ అని కూడా అంటారు. వంటింట్లో దొరికే  ఈ ఉప్పులో కాల్షియం,మెగ్నీషియం,సోడియం, పొటాషియం వంటి లవణాలను కలిగి ఉంటుంది.  చర్మం మీద మొటిమల తగ్గించడమే కాకుండా, పొడిబారకుండా వుండేలా  చేస్తుంది.ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల గళ్ళఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం అన్నింటిని బాగా కలిపి, ముఖం మీద బాగా మర్ధన చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం మీద మొటిమలు తగ్గిపోయి చర్మం పొడిబారకుండా ఉండడమే కాకుండా ప్రకాశవంతంగా ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు రోజూ రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. ఉదయం లేవగానే చల్లని నీటితో కడిగేసుకోవాలి.ఎప్పటికప్పుడు జిడ్డు చర్మం లేకుండా రోజుకు మూడు నుండి నాలుగు సార్లు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖం మీద మొటిమలు రావడాన్ని నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: