గంజి నీరు వల్ల అందానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చాలా మంది అన్నం ఉడికించినప్పుడు వచ్చే ఆ గంజిని పారబోస్తుంటారు. అది ముమ్మాటికీ చాలా పెద్ద తప్పు. అసలు గంజి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? అందంగా ఉండాలంటే ఏం అవసరం లేదు. గంజి నీరు ఉంటే.. ఇక గంజి నీటి వల్ల ఉపయోగాలు చూడండి..ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతల వంటివి ఉంటే వాటిపై ఈ గంజి నీటిని రాయడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. దీనిని ఓ స్ప్రే బాటిల్‌లో పోసి అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండాలి. దీని ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది.
ఇక గంజి నీటిలో కాస్తా పసువు వేసి ఆ నీటిని దూదితో అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు అన్ని దూరం అవుతాయి. అంతేకాకుండా ముఖం కూడా కాంతి వంతంగా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మవ్యాధులు దూరం అవుతాయి. అందాన్ని మెరుగుపరుచుకోవడంలో దీనికి మించినది లేదని చెబుతున్నారు నిపుణులు.గంజిని జుట్టుకి, ముఖానికి రాయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. గంజిలో ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టుకి రాయడం వల్ల జుట్టు రాలే సమస్యల తగ్గుతుంది.
ఇందులోని అమైనో ఆమ్లాలు కుదుళ్ళని బలంగా చేస్తాయి. ఇక ఈ గంజిలో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్‌ని కూడా కలిపి రాయొచ్చు. వాటి వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.ఇక ఇలాంటి మరెన్నో చిట్కాలు కోసం       ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో  అవ్వండి...  ఇంకా  మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: