ఈవిధంగా చేస్తే ఎలాంటి మొటిమలు, మచ్చలు లేని అందమైన ముఖ వర్చస్సు మీ సొంతం!

SS Marvels
ఎలాంటి మొటిమలు లేని సహజ సిద్ధంగా, చక్కగా కళకళలాడుతూ ఉండే స్కిన్ ఎలా సాధ్యమో ఈ క్రింది చిట్కాల ద్వారా తెలుసుకోండి...

1. గోల్డెన్ రూల్
మీరు ప్రతి సారీ, అంటే నిజంగానే ప్రతి సారీ, ఎలాంటి ఎక్సెప్షన్స్ లేకుండా, నిద్ర కి ముందు మేకప్ రిమూవ్ చేసే పడుకోవాలి. స్కిన్ రాత్రి పూట ఊపిరి పీల్చుకుంటుంది, మేకప్ ఉంటే ఆ పని జరగదు. ఫలితంగా పోర్స్ క్లాగ్ అయిపోయి బ్లెమిషెస్, బ్లాక్ హెడ్స్ వచ్చేస్తాయి. ఇంట్లో రడీగా మేకప్ రిమూవర్ లేదా, ఏం పరవాలేదు, కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని ఒక కాటన్ ప్యాడ్ మీద వేసి మృదువుగా ఆ ఆయిల్ ని ఫేస్ మీద మసాజ్ చేయండి. మేకప్, మురికీ అన్నీ పోతాయి. అలాగే, ఎక్స్ఫోలియేషన్ గురించి మరిచిపోకండి. కనీసం వారానికి రెండు సార్లైనా ఎక్స్ఫోలియేట్ చేసి తీరాలి. అప్పుడే డెడ్ స్కిన్ లేయర్స్ రిమూవ్ అయిపోయి స్కిన్ కి మంచి హెల్దీ గ్లో వస్తుంది. వాల్నట్స్ ని పొడి చేసి, ఆ పొడిని పెరుగుతో కలిపి కూడా ఎక్స్ఫోలియేట్ చేయవచ్చు.
2. సన్స్క్రీన్ లోషన్
కనీసం ఎస్‌పీఎఫ్ 15 ఉండే సన్‌స్క్రీన్ ని అప్లై చేయండి. అప్పుడే అది యూవీఏ, యూవీబీ రేస్ ని బ్లాక్ చేయగలుగుతుంది. రెగ్యులర్ గా సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ముడతలు, ఏజ్ స్పాట్స్, వంటివి వచ్చేస్తాయి. అందుకని తప్పని సరిగా స్కిన్ ని సన్ నుండి ప్రొటెక్ట్ చేయాలి. మీరు తీసుకునే సన్ స్క్రీన్ లేబుల్ మీద నాన్-కొమోడోజెనిక్, లేదా, నాన్ యాక్నేజెనిక్ అని ఉన్నది తీసుకోండి. లేదా అంటే మళ్ళీ పోర్స్ బ్లాక్ అయిపోతాయి. ఎండగా ఉన్నా, చలిగా ఉన్నా సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ. అదే మీరు బీచ్ వైపుకి వెళ్తుంటే మాత్రం ఎస్‌పీఎఫ్ 30 కనీసం ఉండేలా చూసుకోండి.
3. ఫుడ్
మీరు మీ ప్లేట్ లో ఏం పెట్టుకుంటున్నారో జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. తాజా పండ్లూ, కూరగాయలు మీ ప్లేట్ లో ఉండాలి. కావాల్సిన విటమిన్స్, మినరల్స్ మీ ఫుడ్ మీకు అందివ్వాలి. విటమిన్ సీ ఎక్కువగా, ఫ్యాట్స్ తక్కువగా ఉండే ఫుడ్ మీకు రేడియంట్ స్కిన్ ని ఇస్తుంది. అలాగే, స్పైసీ, సాల్టీ, ఫ్రైడ్ ఫుడ్ ని వీలున్నంతగా ఎవాయిడ్ చేయండి.
4. చెమట
రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. రన్నింగ్, జాగింగ్, యోగా వంటివి మీ బాడీ కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ని అందిస్తాయి. అంతే కాక, బాడీలో నిత్యం జరిగే క్లీనింగ్ ప్రాసెస్ ని స్పీడప్ చేస్తాయి. వర్కౌట్ తరువాత ఫేస్ లో మంచి గ్లో అందుకే వస్తుంది. టైమ్ తక్కువగా ఉన్న రోజుల్లో కనీసం బ్రిస్క్ వాక్ చేయండి. అలాగే, వర్కౌట్ కి ముందూ తరువాతా స్కిన్ కేర్ ని స్కిప్ చేయకండి. వర్కౌట్ కి ముందు టోనర్ అప్లై చేయండి. ఆ తరువాత ఎక్స్ఫోలియేట్ చేసి ఆలివ్ ఆయిల్ కానీ, షియా బటర్ కానీ మాయిశ్చరైజింగ్ కొరకు యూజ్ చేయండి.
5. నిద్ర
రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. మీకు నిద్ర సరిపోకపోతే ఎలా అలసటగా అనిపిస్తుందో స్కిన్ కి కూడా అలానే ఉంటుంది. వారానికి రెండు మూడు సార్లు తేనె అప్లై చేసుకున్నా కూడా స్కిన్ హీల్ అవుతుంది. నిద్ర కి ముందు ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవటం మాత్రం మర్చిపోకండి. డ్రై స్కిన్ ఉన్నవారు ఆల్కహాల్ లేని మైల్డ్ క్లెన్సర్స్ యూజ్ చేయాలని గుర్తు పెట్టుకోండి.
6. మంచి నీరు
రోజంతా నీరు తాగుతూ ఉండాలి. కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. అలాగే, నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, కుకుంబర్, క్యాప్సికం, పాలకూర, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లూ కూరగాయలూ తీసుకోండి. లోపలి నుండి మంచి నీరు ఎంత మేలు చేస్తుందో బయట నుండి రోజ్ వాటర్ అంత సాయం చేస్తుంది. పఫ్ఫీ ఐస్ సమస్యని రెడ్యూస్ చేస్తుంది, పీహెచ్ బ్యాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తుంది, స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది.

7. బైబై యాక్నే
గోరు వెచ్చని నీటితో రోజుకి మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకోండి, వాష్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ మీద మృదువుగా, గుండ్రంగా మసాజ్ చేయండి. మీ ఫేస్ వాష్ లో ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్, బీటా హైడ్రాక్సిల్ యాసిడ్ ఉండేలా చూసుకోండి. క్లెన్సింగ్ తరువాత మెత్తని బట్టతో అద్ది బెంజాయిల్ పెరాక్సైడ్ ఉన్న లోషన్ అప్లై చేయండి. పొరపాటున కూడా పింపుల్ ని గిల్లకండి. మొటిమ వస్తున్నట్టు తెలుస్తోందా? ఆ యేరియా ని రోజ్ వాటర్ తో క్లీన్ చేసి, బాగా చల్లగా ఉన్న గ్రీన్ టీ బ్యాగ్ ని ఆ ప్లేస్ లో పది నిమిషాల పాటు ఉంచండి. మీరు కళ్ళజోడు కానీ, సన్ గ్లాసెస్ కానీ వాడుతూ ఉంటే వాటిని కూడా తరచూ క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే, మీ కంటి చుట్టుతా, ముక్కు దగ్గరా పోర్స్ క్లాగ్ అయిపోతాయి.
8. ఆయుర్వేదం
స్కిన్ కి చక్కని పోషణ కావాలంటే ఎక్కడికో వెళ్ళక్కరలేదండీ, మన ఆయుర్వేదం లోనే ఒక మంచి చిట్కా ఉంది. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, అర టీ స్పూన్ పసుపు, చిటికెడు కర్పూరం, చిటికెడు గంధం పొడి తీసుకుని వీటన్నింటినీ, రోజ్ వాటర్, లేదా పాలు, లేదా నీటితో కలిపి ఫేస్ పాక్ వేసుకోండి. సుదర్శన క్రియ ని మీ బ్యూటీ మంత్రా చేసుకోండి. ఇందు వల్ల ఒత్తిడి తగ్గుతుంది, శరీరం, మైండ్, ఎమోషన్స్ అన్నీ హార్మనీ లో ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు.
9. స్పా
రెగ్యులర్ గా మీ స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వండి. మీ స్కిన్ టైప్ ని బట్టి కొబ్బరి నూనె, ఆవ నూనె, ఆల్మండ్ ఆయిల్ వంటి నూనెలతో మసాజ్ చేసుకోండి.
10 హెల్దీ హ్యాబిట్స్
మీకు మీరు కొంత సమయం కేటాయించుకోండి. ఒత్తిడి కి దూరంగా ఉండండి. రోజుకి ఐదు నిమిషాలైనా ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేయండి. చిరు నవ్వుతో ఉండండి. మీరు ఎంత చక్కని డ్రెస్ వేసుకున్నా, ఎంత మంచి మేకప్ యూజ్ చేసినా చిరు నవ్వు లేకపోతే అవి ఎందుకూ పనికిరావు.
ఈ ఆరోగ్యకరమైన పద్ధతులని ఫాలో అవుతూ హ్యాపీ గా హెల్దీ గా ఉండండి. ఏదైనా కొంచెం తేడాగా అనిపిస్తే వెంటనే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయడానికి సందేహించకండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: