నల్లని ఒత్తైన జుట్టు పొందాలంటే ఈ ఆకులను తప్పక వాడల్సిందే..

Satvika
అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.. అయితే వాటికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ ప్రయోజనం లేక బాధపడుతుంటారు. అందంగా కనిపించాలంటే జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండాలి. అప్పుడే అందం రెట్టింపు అవుతుంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు రాలే సమస్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఆహారంలో మార్పులు రావడం, పౌష్టకాహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఊడిపోవడం తో పాటు చిన్న వయసులోనే తెల్లగా మారుతుంది. 



ఎంతగా రంగులు వేసుకున్న కొద్ది రోజులకే మళ్లీ తెళ్లబడుతుంది. అయితే కొన్ని రకాల న్యాచురల్ పద్దతులలో వాడితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. జామకాయ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఇందులో ఉండే సహజ గుణాలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. మధుమేహం ఉన్న వాళ్ళు జామకాయలను తీసుకోవడం వల్ల వ్యాధి అదుపులోకి వస్తుంది. లేత జామ ఆకులను నమిలితే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ జామ అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి ఈ జామను ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా వాడుతుంటారు. ఎన్నో సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అలాంటి జామ ఆకులతో తెల్లని జుట్టును మాయం చేయవచ్చునట ఎలానో చూద్దాం.. జామ ఆకులతో తెల్లని జుట్టును నల్లగా మార్చవచ్చినట అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..


కావలసిన పదార్థాలు: 

జామ ఆకులు : 5

కరివేపాకు : 20 

ఉసిరికాయ : ఒకటి

కొబ్బరి నూనె : 150 మి.లీ


తయారీ విధానం: 

ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి..కాస్త వేడయ్యాక జామ ఆకులను, ఉసిరి ముక్కలను,కరివేపాకును ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అవి మగ్గే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఆ మిశ్రమం చల్లబడిన తర్వాత వడపోసి, గాజు సీసాలో లేదా ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను వారానికి ఒకసారి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు మాయమవుతుంది.. ఇలా నెలలో మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుందట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: