అందమైన చర్మం కోసం ఏం తినాలంటే ?

Rakesh Singu
అందమైన మరియు  మిళ మిళ లాడే చర్మం కావాలని అందరికి ఉంటుంది. దాని కోసం చాలా మంది ఫేస్ క్రీమ్స్   వాడతారు . అందులో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఎక్కువ కాలం  ఈ ఫేస్ క్రీమ్స్ వాడటం వల్ల   మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది .మన  చర్మం యొక్క గోప్ప తనం ఏంటంటే పాత కణాలు మరియు చెడిపోయిన కణాలు  నిరంతరం  కొత్త కణాలతో రిప్లేస్ అవుతుంటాయి. మంచి పోషకాహారం మరియు మంచి జీవన శైలి ఉంటే  ఈ  ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. దాని వల్ల మీ చర్మం సహజంగా అందంగా అవుతుంది.


విటమిన్ సి మంచి యాంటీఆక్సిడెంట్.ఇది రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది  అంతేకాకుండ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు మచ్చలను తోందరగా పోగొడుతుంది . యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా నిమ్మకాయ. జామకాయ, కివి ఫ్రూట్స్, నారింజ, బొప్పాయి, స్ట్రాబెర్రీ , బ్లాక్ కారెంట్స్, బ్లూ బెర్రీస్ లో ఉంటాయి.


జింక్ ఎక్కువగా తీసుకోవడం చర్మానికి చాలా మంచిది. జింక్ చర్మాన్ని  డ్యామెజ్ కాకుండా కాపాడుతుంది . అలాగే చర్మాన్ని మృదువుగా చేస్తుంది.జింక్ అధికంగా  చేపలు, రెడ్ మీట్ , నువ్వులు, వేరుశనగకాయ,పుట్టగొడుగులు, ఆకుకూరల్లోఉంటాయి.

రోజుకు కనీసం 6-7 గ్లాసుల నీరు తాగలి . నిమ్మకాయ లేదా  వాటర్ మిలన్ వంటి పండ్ల రసం తీసుకుంటే ఇంకా మంచిది.రోజు కనీసం 6-8 గంటల నిద్ర చాలా అవసరం.

విటమిన్ ఇ ఆరోగ్యకరమైన చర్మం పెరగడానికి తోడ్పడుతుంది.విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలలో బాదం, అవోకాడో, సన్ ఫ్లవర్ ఆయిల్, మొక్కజొన్న నూనె. 

 ఆరోగ్యకరమైన  చర్మానికి   మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు  చాలా అవసరం -    అవోకాడో,  చేపలు, కాయగూరలు మరియు విత్తనాలలో కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: