నిద్రలేమి శారీరక సమస్యలు

Durga
యాంత్రిక జీవనంలో చాలామందికి మంచి నిద్ర అన్నదే గగనమవుతోంది. తగినంత నిద్రలేకుంటే మానసిక, శారీరక సమస్యలు తప్పవు. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు హేతువని వైద్య నిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు. వీటి నుంచి విముక్కి పొందాలంటే రోజూ ఆరు నుండి ఏడు గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. మంచి నిద్ర కోసం మేలైన ఈ కిటుకులను పాటించండి. 1. రోజంతా లైట్ల వెలుతురులోనే గడిపితే స్లీపింగ్ ప్యాటర్న్ లో తేడాలు వస్తాయి. కృత్రిమకాంతి కంటికి, ఒంటికి ఒత్తిడిని కలుగజేస్తుంది. అందుకని పగటిపూట ముప్పై నిముషాలైనా సూర్యకాంతి ఒంటికి తగలనివ్వాలి. 2. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం వల్ల శరీరం నిద్రా సమయాలకు చక్కగా అలవాటు పడిపోతుంది. 3. రోజూ ఒకే సమయానికి బోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు హెచ్చుతగ్గులు కాకుండా ఉంటాయి. అందుకని రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందుగా భోజనం చేయాలి. దీని వల్ల అజీర్తి సమస్యలు తలెత్తవు. అలాగే ఆకలితో పడుకోకూడదు. తేలికగా జీర్ణం అమ్యే ఆహారం లేదా ఒక అరటిపండు లేదా రైస్ కేక్స్ లాంటివి తీసుకోవాలి. 4. వ్యాయామం చక్కని నిద్రకు సహకరిస్తుంది. అందుకోసం రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందు ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేయాలి. 5. కెఫిన్, నికోటిన్ రెండూ ప్రేరకాలు. పగలు తీసుకునే కెఫిన్ రాత్రి నిద్రపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకని పొగతాగడాన్ని, అమితంగా కాఫీ, టీలు సేవించడాన్ని ఆపివేయాలి. 6. రాత్రి సమయాల్లో మద్యాన్ని తీసుకోకూడదు. మద్యం మగతను తెప్పిస్తుందే తప్ప గాఢమైన నిద్రను కలిగించదు. 7. హాయిగొలిపే నిద్రకు గది వాతావరణం కీలకం. బెడ్ రూమ్ వెచ్చగా ప్రశాతంగా ఉండటమే కాకుండా, చిరు చీకటిగా ఉండేలా జాగ్రత్తపడాలి. 8. బెడ్ రూమ్ అనేది కేవలం నిద్రించడానికి, శృగారిచడానికి మాత్రమే పరిమితం చేయాలి. మిగతా ఆందోళనలేమీ బెడ్ రూమ్ లోకి తీసుకురాకూడదు. 9. పడుకునే ముందు టీవీ చూడండి. అయితే ఉద్రేకం కలిగించే కార్యక్రమాలను చూడకూడదు. పడుకునే ముందు పుస్తకపఠనం ఉపయోగపడుతుందని చాలామంది అంటారు. అయితే ఉద్రేకం కలిగించే పుస్తకాలను చదవకూడదు. 10 సాయంకాలం తగినంత విశ్రాంతిని పొందాలి. కాసేపు టీవి చూడ్డం. ప్రశఆంతతను కలిగించేనూనెలు రాసుకొని గోరువెచ్చని నూనెలో రాసుకొని గోరువెచ్చని నూనెతో స్నానం చేయడం, పడుకోవడానికి ముందు వేడివేడి పాలు తాగడం వంటివి మానేయాలి. 11. బెడ్ మీదకు చేరిన వెంటనే లైట్ ఆర్పేసి పడుకోకూడదు. ఒక అరగంటపాటు బెడ్ మీద కూర్చోవడం, లేవడం, పుస్తకాలు చదవడం, చక్కని సంగీతం వినడం వంటివి చేస్తే కంటి మీదకు కునుకు రెక్కలు కట్టుకొని వాలుతుంది. Whether mechanical life  for the majority of . Without enough , psychological, and physical problems can go. Insomnia can cause many health problems, medical experts warn that there will

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: