Google: కార్ యాక్సిడెంట్లని ఆపే సూపర్ ఫీచర్?

Purushottham Vinay
Google: కార్ యాక్సిడెంట్లని ఆపే సూపర్ ఫీచర్?


ప్రపంచంలో చాలా చోట్లా కూడా కార్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సిటీల్లో అయితే ఈ యాక్సిడెంట్ల వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఇక అలాంటి యాక్సిడెంట్లకి చెక్ పెట్టే ఫీచర్ ఒకటి వచ్చింది. ఆ ఫీచర్ తో యాక్సిడెంట్లని ఈజీగా ఆపేయొచ్చు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఫేమస్ ఇంటర్నేషనల్ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ కారు ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు కొత్తగా సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌ కంపెనీకి చెందిన పిక్సెల్‌ ఫోన్‌లో ఈ కార్ క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు.ఈ ఫీచర్‌ సహాయంతో కారు ప్రమాదాలకు చాలా ఈజీగా అడ్డుకట్ట వేయొచ్చు.ఇండియాతో పాటు కొన్ని దేశాల్లో గూగుల్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. 


పిక్సెల్‌ ఫోన్‌లో తీసుకొచ్చిన కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ సహాయంతో ప్రమాదాలకు చాలా ఈజీగా చెక్‌ పెట్టొచ్చని.. ఆండ్రాయిడ్ ఎక్స్‌పర్ట్ మిషాల్ రెహ్మాన్ పేర్కొన్నారు.మన కారు ప్రమాదానికి గురైనప్పుడు.. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమెటిక్‌గా ఎమర్జెన్సీ అలర్ట్‌ 112 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కాల్‌ వెళ్తుంది. ఇంకా అలాగే వెంటనే.. లొకేషన్‌ కూడా షేర్‌ అవుతుంది. మీరు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని ఇతరులకు ఇది తెలియజేస్తుంది.గూగుల్ కంపెనీ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను.. భారత్‌, ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్ ఇంకా స్విట్జర్లాండ్‌లలో విడుదల చేయగా, ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది.ఇక గూగుల్ పిక్సెల్‌ ఫోన్స్‌లో పర్సనల్ సేఫ్టీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని యాప్‌లో కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం లొకేషన్‌, మైక్రోఫోన్‌ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ పర్మిషన్ వంటి ఆప్షన్స్‌కు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది.ఇక ఇలాంటి ఫీచర్ ని మనం టాలీవుడ్ సినిమా చిత్ర లహరి సినిమాలో ఇది వరకే చూసాం. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: