ఓలా బంపర్ ఆఫర్.. సగానికి పైగా డిస్కౌంట్?

Purushottham Vinay
తెలుగు వారి కొత్త సంవత్సరం దగ్గరకి వచ్చేస్తోంది. చాలామంది కూడా పవిత్రమైన ఉగాది పండుగ నాడుఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది కూడా కార్లు, బైక్లు వంటివి ఎక్కువగా కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు.ఇప్పుడు పెట్రోల్ రెట్లు బాగా పెరిగిపోవడంతో అందరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఆసక్తి చూస్తున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేసేవారికి  శుభవార్త.ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కొంచెం కాదు ఏకంగా సగానికి పైగా తగ్గింపుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ బంపర్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఓలా నిజంగా ఓ ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా స్కూటర్ల తయారీలో ఓలా కంపెనీ తన మార్క్ చూపించింది. ఇండియన్ మార్కెట్లో  ఎలక్ట్రిక్ స్కూటర్లంటే ఓలా అనేలా బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుంది.అటువంటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై తన కస్టమర్ ల కోసం ఇప్పుడు అదిరే ఆఫర్లు ప్రకటించింది. ఒక్కో స్కూటర్ పై ఏకంగా రూ. 70 వేల దాకా భారీ తగ్గింపును అందిస్తోంది.ఓలా ఎస్ 1 ప్రో మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర వచ్చేసి ప్రస్తుతం రూ. 1,39,999గా ఉంది. దీన్ని మీరు ఇప్పుడు కేవలం రూ. 69,999కే పొందొచ్చు.


ఇంకా అంతేగాక ఈ మోడల్‌పై ఏకంగా 4 ఆఫర్లు లభిస్తున్నాయి.ఇక అవేంటంటే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై నేరుగా ఏకంగా రూ. 10 వేల తగ్గింపు ఉంది. ఇంకా అలాగే స్టూడెంట్, కార్పొరేట్ స్పెషల్ డిస్కౌంట్ కూడా రూ. 5 వేలు లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఏకంగా రూ. 45 వేల దాకా ఉంది. ఇంకా అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల దాకా లభిస్తుంది. ఇలా మీరు మొత్తంగా రూ. 69,999కే ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని పొందొచ్చు.ఇక ఓలా ఎస్1 మోడల్ విషయానికి వస్తే.. 3 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర వచ్చేసి రూ. 1,09,999గా ఉంది.అయితే దీనిపై నేరుగా ఎలాంటి డిస్కౌంట్ లేదు. అలాగే స్టూడెంట్స్, కార్పొరేట్ స్పెషల్ డిస్కౌంట్ వచ్చేసి రూ. 3 వేలు ఉంది. అలాగే ఈ మోడల్‌పై మాక్సిమం ఎక్స్చేంజ్ వాల్యూ రూ. 45 వేలు పొందొచ్చు. దీనికి ఎక్స్చేంజ్ బోనస్ లేదు. అంటే  ఈ స్కూటర్‌ను మీరు రూ. 61,999కు కొనొచ్చు. ఇక దీని ఈ ఆఫర్లు మార్చి 31 దాకా మాత్రమే అందుబాటులో ఉంటాయి.EMI ఆప్షన్ కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: