మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధరలు పెంపు?

Purushottham Vinay
ఇండియాలో టాప్ ఆటోమొబైల్ కంపెనీగా దూసుకుపోతున్న మహీంద్రా తన XUV700 SUV ధరలతో పాటు స్కార్పియో క్లాసిక్ ధరలను కూడా పెంచుతున్నట్లు తెలిపింది. స్కార్పియో క్లాసిక్ ధరలు పెరగటం ఇదే ఫస్ట్ టైమ్.మహీంద్రా కంపెనీ  కొత్త స్కార్పియో క్లాసిక్ గత సంవత్సరం ఆగష్టు నెలలో విడుదలైంది. ఈ లేటెస్ట్ SUV విడుదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా ధరల పెరుగుదలను అందుకోలేదు. అందువల్ల ఇప్పుడు ధరలు అమాంతం పెరిగాయి. S,  S11 ధరలు రూ. 65,000 పెరిగి వరుసగా రూ. 12.64 లక్షలు ఇంకా రూ. 16.14 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ధరల పెరుగుదలకు ముందు ఈ SUV ధరలు రూ. 11.99 లక్షలు ఇంకా రూ. 15.49 లక్షలుగా వున్నాయి.మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 7సీటర్ ఇంకా 9 సీటర్ కాన్ఫిగరేషన్స్ లో అందుబాటులో ఉంటుంది. S , S11 ట్రిమ్‌లు రెండు కూడా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉన్నాయి.ఇక 7 సీటర్స్ విషయానికి వస్తే, ఇది 2-3-2 లేఅవుట్ మధ్యలో బెంచ్ సీటు ఇంకా మూడవ వరుసలో రెండు సింగిల్ జంప్ సీట్లు అలాగే 2-2-3 సీటింగ్ లేఅవుట్ వంటివి ఉన్నాయి.


రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు ఇంకా అలాగే మూడవ వరుసలో బెంచ్ సీటు ఉన్నాయి.ఇక 9 సీటర్ కార్ విషయానికి వస్తే, ఇది 2-3-4 లేఅవుట్‌ కలిగి ఉండటమే కాకుండా మూడవ వరుసలో డబుల్ సైడ్ ఫేసింగ్ జంప్ సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం S ట్రిమ్ కి మాత్రమే లిమిట్ చేయబడి ఉంటుంది.S11 లో ఈ 9 సీటర్ ఆప్షన్ అనేది లేదు. అందువల్ల 9 సీటర్ అనేహి కేవలం ఒకే వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే డిజైన్ ఇంకా ఫీచర్స్ పరంగా రెండూ కూడా అప్డేటెడ్ గా ఉంటాయి.ఇంకా ఈ కొత్త స్కార్పియో క్లాసిక్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కొత్త లోగో, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ , ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ ఇంకా అప్‌డేట్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్ అలాగే ఇరువైపులా డ్యూయల్ టోన్ క్లాడింగ్, రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇంకా అలాగే సైడ్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ వంటివి కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: