గుడ్ న్యూస్: రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్?

Purushottham Vinay
ఇక రెనాల్ట్ ఇండియా డిసెంబర్ నెలలో కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. కంపెనీ రెనాల్ట్ ట్రైబర్‌, రెనాల్ట్ క్విడ్‌ ఇంకా అలాగే రెనాల్ట్ కిగర్‌పై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.ఇక ఇందులో రెనాల్ట్ ట్రైబర్‌పై మాక్సిమం రూ.50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ భారీ తగ్గింపు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఇంకా అలాగే కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో ఉంటుంది. మీరు ఈ కార్లలో దేనినైనా కొనుగోలు చేయాలనుకుంటే మీరు సమీపంలోని రెనాల్ట్ ఇండియా డీలర్‌షిప్‌ను విజిట్ చేయవచ్చు. ఈ ఆఫర్‌లు 31 డిసెంబర్ 2022 దాకా మాత్రమే చెల్లుబాటు అవుతుందని గుర్తించుకోండి.రెనాల్ట్ ట్రైబర్‌ కారు ఎంపిక చేసిన వేరియంట్లపై కస్టమర్లు రూ. 15,000 డిస్కౌంట్ పొందుతారు. ఈ కార్ పై రూ.25,000 వరకు ఎక్స్చేంజ్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా అలాగే అదే సమయంలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10,000 దాకా కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే గ్రామీణ రాయితీ కూడా ఉంది. దీని కింద రైతులు, సర్పంచ్ ఇంకా గ్రామ పంచాయతీ సభ్యులు రూ. 5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.


రిలైవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద మొత్తం రూ. 10,000 అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.రెనాల్ట్ క్విడ్‌పై డిసెంబర్ నెలలో రూ. 35,000 వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ ఇంకా రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఆర్‌ఎక్స్‌ఈ తప్ప అన్ని మోడళ్లపై ఎక్స్ఛేంజ్ తగ్గింపు వర్తిస్తుంది. ఇంకా అలాగే ఇది కాకుండా, రిలీవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 10,000, రూరల్ బెనిఫిట్ రూ. 5,000 ఇంకా అలాగే రూ.10,000 తగ్గింపును పొందుతోంది.ఇంకా అలాగే క్విడ్ లాగానే రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రూ. 35,000 దాకా తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు ఇంకా రూ.15,000 దాకా కూడా ఎక్స్ఛేంజ్ తగ్గింపు అనేది ఉంటుంది.అయితే ఎస్‌యూవీపై నగదు తగ్గింపు లేదు. కానీ రూ.5,000 గ్రామీణ తగ్గింపు అనేది అందుబాటులో ఉంది.ఇంకా అలాగే దీనితో పాటు రిలీవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ.10,000 వరకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: